దేశంలో ఇప్పుడు కరోనా ఎంతగా కలకలం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. మార్చి 24 నుంచి కరోనా పై యుద్దం ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.  ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో ఎక్కడి వ్యవస్థలు అక్కడే అష్టదిగ్భందంగా మారిపోయాయి.  ఆర్థిక వ్యవస్థపై పెద్ద బండరాయి పడింది.. అందే కాదు కోట్ల మంది ఉపాది కోల్పోయారు.. చిరు వ్యాపారులు, ఉద్యోగులు విల విలలాడారు.  చేయడానికి పనిలేక బయటకు వెళ్లలేక రెండు నెలలు మాత్రం నరకం అనుభవించారు.  తాజాగా తాను సీఎం ఆఫీసు నుంచి వచ్చిన ప్రత్యేక అధికారిని అంటూ ఓ వ్యక్తి అధికారులను హడలెత్తించాడు. కొన్ని రికార్డులు పరిశీలించాలని అనుకుంటున్నానని వెంటనే అందుబాటులో ఉంచాలని సూచించారు. సీఎం ఆఫీస్ నుంచి అనగానే అక్కడి అధికారులు హడలి పోయారు. ఎమ్మార్వో ఆఫీసులో ఎవరూ లేకపోవడంతో అసహనం కూడా వ్యక్తం చేశాడు.

 

ఈ విషయంపై  ఆరా తీస్తే అసలు అలాంటి అధికారి లేరని ఉన్నతాధికారులు చెప్పడంతో ఆకతాయి పనిగా గుర్తించారు. అతన్ని మరుసటి రోజు చాలా తెలివిగా ఆఫీసుకి రప్పించి పోలీసులకు అప్పగించారు.  వివరాల్లోకి వెళితే..  రాజమండ్రిలోని అర్బన్‌ తహసీల్దార్‌ కార్యాలయంతో పాటు స్థానిక వార్డు సచివాలయాలకు ఓ వ్యక్తి వచ్చాడు. నేరుగా తహసీల్దార్‌ గదిలోకి వెళ్లి ఆయన సీట్లో కూర్చున్నాడు. అక్కడ ఉన్న అధికారులు అతన్ని చూసి మొదట ఆశ్చర్యపోయినా.. అతడు దర్జాగా సీట్లో కూర్చోవడం చూసి ఆశ్చర్యపోయారు.

 

సీఎం ఆఫీస్  నుంచి వచ్చిన ప్రత్యేక అధికారి అని ఐడీ చూపించాడు. డిప్యూటీ తహసీల్దార్‌ బాపిరాజుతో మాట్లాడి తనకు కావాల్సిన రికార్డులను సిద్ధం చేయాలని సూచించి వెళ్లిపోయాడు. అయితే అతని వాలకం చూసి అనుమానం వచ్చిన ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు. అతడు రాజవొమ్మంగి మండలం లబ్బర్తి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. బీఎడ్‌ పూర్తి చేసి  ఖాళీగా ఉంటున్నాడని తెలిపారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించారు. కాగా అతని వద్ద ప్రభుత్వ అధికారుల అందరి ఫోన్ నంబర్లు ఉండటం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి: