దేశంలో కరోనా కేసులు పెరుతుందున్న తాజాగా మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. ఈ నిర్ణయం వలన కేబుల్ టీవీ యూజర్లకు ప్రయోజనం కలగనున్నట్లు సమాచారం. ఇంతకు కేంద్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకోబోతుందని ఆలోచిస్తున్నారా? కేంద్ర ప్రభుత్వం కేబుల్ టీవీ లైన్ ద్వారా ఇంటర్నెట్ సేవలు అందించాలని ఆలోచిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దీనికి సంబంధించిన నిబంధనలను రూపొందించిందన్నారు. త్వరలోనే దీనికి ఆమోదం లభించనుంది.

 

 

ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌ కాస్టింగ్ మినిస్ట్రీ ఈ మేరకు రూల్స్‌ను రూపొందించింది. ఈ వారంలోనే డిజిటల్ కమ్యూనికేషన్ కమిషన్ కూడా భేటీ కానున్నారు. కోవిడ్ 19 వల్ల చాలా మంది ఇంటి వద్ద నుండే పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి నెట్ ‌వర్క్ సమస్యలు కూడా ఎదురవుతూన్నాయి. వారికీ ప్రయోజనం కలిగించేలా కూడా తాజా నిబంధనలు ఉండనున్నాయని తెలిపారు.

 

 

ఇంకా దీనికి బ్రాడ్‌ బాండ్ కనెక్షన్స్ డిమాండ్ భారీగా పెరిగింది. లాక్ డౌన్ సమయంలో ఏకంగా 50 శాతం మేర కనెక్షన్లు తీసుకున్నట్లు సమాచారం. కాగా దేశంలో పన్నెడు కోట్ల ఇళ్లకు కేబుల్ టీవీ సర్వీసులు ఉన్నాయని తెలిపారు. కొత్త రూల్స్ కారణంగా కేబుల్ టీవీ లైన్ ద్వారా బ్రాడ్ ‌బాండ్ సర్వీసులు కూడా అందుబాటులోకి వస్తే చాలా మందికి ప్రయోజనం కలుగుతుందని తెలియజేశారు.

 

 

కేంద్ర ప్రభుత్వం వచ్చే ఒక్కటి, రెండు నెలల కాలంలో కొత్త రూల్స్‌కు సంబంధించిన నిబంధనలను జారీ చేయనున్నట్లు తెలిపారు. అలాగే కేబుల్ టీవీ ఆపరేట్లు, ట్రాయ్, టెలికం విభాగాలకు చెందిన వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటుంది. లైసెన్స్ ఫీజులు, ఏజీఆర్ అంశంపై కూడా చర్చలు జరగనున్నాయి. తాజా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వల్ల పది కోట్ల మందికి ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఆపరేటర్లు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం ఇన్వెస్ట్ చేయాల్సి రావొచ్చునన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: