కుక్కలు ఎంతో విశ్వాసం తో ఉంటాయి అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఒకానొక సమయంలో మనుషులు చూపించనంత ప్రేమ ను కూడా కుక్కలు మనుషులు పైకి చూపిస్తూ వుంటాయి. ఇక ప్రస్తుతం ఎంతో అల్లారు ముద్దుగా సొంత బిడ్డలే  అన్నట్టుగా ఎంతోమంది కుక్కలను కూడా పెంచుకుంటారు అనే విషయం తెలిసిందే. ఇక కుక్కల పట్ల యజమానులు యజమానుల పట్ల కుక్కలు కూడా ఎంతో ప్రేమ ఆప్యాయత ఉంటాయి. ఒకవేళ కుక్కకు ఏమన్నా అయి ప్రాణాలు విడిచింది అనుకోండి  యజమాని ఎంతో బాధపడుతూ ఉంటాడు. అదే సమయంలో యజమాని చనిపోతే కుక్క మనిషిలా బాధను బయటకు చెప్పుకోలేకపోవచ్చు కాని అంతకుమించి బాధ అనుభవిస్తూ ఉంటుంది. 

 


 తాజాగా ఇక్కడ జరిగిన ఘటన చూస్తే అందరికీ హృదయాలను కలచివేస్తుంది. ఒక కుక్కని యజమాని ఎంతో ఆప్యాయంగా పెంచుకున్నాడు. దీంతో కుక్కకి యజమానికి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ఆ తర్వాత ఆ యజమాని కొన్ని కారణాల వల్ల ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. దీంతో ఆ కుక్క  గుండెపగిలి పోయినట్టుంది. తన యజమాని ఆత్మహత్య చేసుకుని చోటే తన యజమాని కోసం ఎదురు చూస్తూ అక్కడే ఉంటుంది ఆ శునకం . ఈ ఘటన చైనాలోని ఊహల్లో చోటుచేసుకుంది. మే 30వ తేదీన తన పెంపుడు కుక్క ఎదుటే  ఊహల్లో  వంతెన పైనుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. 

 


 ఇక అప్పటి నుంచి తన యజమాని తిరిగి వస్తాడు అనుకుంటు ఆ బ్రిడ్జి వద్ద  రోజు ఎదురు చూస్తుంది శునకం . ఇక ఆ కుక్కను గమనించిన మరో వ్యక్తి ఆ కుక్కను పెంచుకోవాలని తన వెంట తీసుకెళ్లిప్పటికీ అతని దగ్గర నుంచి తప్పించుకొని వచ్చి మళ్లీ ఆ బ్రిడ్జి దగ్గర తన యజమాని తిరిగి వస్తాడు అని ఎంతో ఆశగా ఎదురు చూస్తోంది ఆ శునకం   ఈ విషయం తెలిసిన ఆ వ్యక్తి  శునకాన్ని  ఫోటో తీసి సామాజిక మాధ్యమాల్లో పోటీ చేయగా ప్రస్తుతం అది వైరల్ గా మారిపోయింది. మనిషి జీవితం ఎంతో విలువైనది మీ కోసం జీవిత కాలం ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. ఒక మనిషి పట్ల కుక్క ఎంత ప్రేమ ఆప్యాయత ఉంటుందని ఈ ఘటన నిదర్శనంగా మారింది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: