బిజెపి పార్టీ తెలంగాణలో ఎన్నో రోజుల నుంచి పార్టీ బలోపేతానికి ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా ఎంపీ బండి సంజయ్ నియామకం అయిన తర్వాత బిజెపి తెలంగాణ రాజకీయాల్లో  కాస్త వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది అనడంలో అతిశయోక్తి లేదు. గతంలోనే ఏకంగా నాలుగు పార్లమెంటు స్థానాలు గెలుచుకొని టీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ లోక్సభ ఎన్నికలప్పటికల్లా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ  పార్టీని బలోపేతం చేసి టిఆర్ఎస్ పార్టీని గద్దె దింపాలని ఆశా భావంతో ఉంది  ప్రస్తుతం బిజెపి పార్టీ. బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఆ దిశగా కసరత్తులు కూడా ప్రారంభించారట. 

 

 ప్రస్తుతం బీజేపీ లోకి చేరికలు ప్రోత్సహిస్తున్నారు బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్. తెలంగాణలోని ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ లోక్సభ స్థానాలను గెలుపొందిన బిజెపి పార్టీ ఈసారి పెద్దపల్లి స్థానాన్ని కూడా కైవసం చేసుకోవాలని ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టింది . ఈ క్రమంలోనే పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే అయినా రాజమళ్లు,  మున్సిపల్ మాజీ చైర్మన్ ఏలువాక రాజయ్యలను  బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ తమ పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. వీరు గత కొంతకాలంగా టిఆర్ఎస్ అధికారిక కార్యక్రమాలు అన్నింటికీ కాస్త దూరంగా ఉంటున్నారు, బిజెపి పార్టీలోకి వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు అనే టాక్ కూడా వినిపిస్తోంది.

 

 అంతేకాకుండా కరీంనగర్ జిల్లాకు చెందిన ఎంపీ బండి సంజయ్ ప్రస్తుతం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు గా ఉండడం... అటు వివేక్ కూడా పార్టీ బలోపేతంపై దృష్టి సారించడంతో... ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలోని ఇతర పార్టీ నాయకులు అందరిని బీజేపీ వైపు ఆకర్షించడానికి గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇక వచ్చే ఎన్నికల్లో  పెద్దపల్లి స్థానం నుంచి వివేక్ పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని చర్చించుకుంటున్నారు. ఈసారి ఎలాగైనా పెద్దపల్లిలో కాషాయ జెండా ఎగర వేయడమే లక్ష్యంగా ప్రస్తుతం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: