ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుత ఆంధ్ర రాజకీయాల్లో నిమ్మగడ్డ వ్యవహారమే హాట్ టాపిక్ గా మారిపోయింది. అటు హైకోర్టు ప్రభుత్వానికి రోజులు షాక్ ఇస్తూ తీర్పు ఇస్తూ వస్తోంది. ఇదిలా ఉంటే నిమ్మగడ్డ కేసులో ఏపీ హైకోర్టు లో తాజాగా మరో పిటిషన్ కూడా దాఖలయింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏపీ ఎన్నికల కమిషనర్ గా నియమిస్తూ 2016 సంవత్సరంలో జారీ చేసిన జీవోను వెంటనే కొట్టి  వేయాలి అంటూ గుంటూరు జిల్లాకు చెందిన శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో  తాజాగా పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్ నియామకం... మంత్రిమండలి సిఫార్సు మేరకు జరగడానికి వీలు లేదు అంటూ తెలిపింది ఏపీ హైకోర్టు. 

 

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్ నియామకం అనేది కేవలం రాష్ట్ర గవర్నర్ విచక్షణ మేరకే జరగాలి అంటూ మొన్నటికి మొన్న ఏపీ హైకోర్టు జగన్ సర్కార్ కు షాక్ ఇస్తున్న తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా దాఖలైన పిటిషన్ను ఏ అధికారంతో ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏ అధికారంతో  కొనసాగుతున్నారని.. ఆయనను వివరణ కోరాలి అంటూ ఆరోపించారు. ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని విధులు నిర్వహించకుండా వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు పిటిషనర్ . ఇక తాజాగా దాఖలైన పిటిషన్ తో నిమ్మగడ్డ కేసు మరో మలుపు తిరిగింది. 

 


 మొన్నటికి మొన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను మళ్లీ ఎన్నికల కమిషనర్గా నియమించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయగా... అటు వెంటనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు, అదే సమయంలో నిమ్మగడ్డ  రమేష్ కుమార్ ప్రభుత్వ అనుమతి లేకుండా విధుల్లో చేరడం చెల్లదు అంటూ సరికొత్త వాదన తెరమీదకు తెచ్చింది జగన్ సర్కార్ . ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేసింది జగన్ సర్కార్. మరోసారి నిమ్మగడ్డ కేసుకు సంబంధించి హైకోర్టులో పిటిషన్ దాఖలు కావటం చర్చనీయాంశంగా  మారిపోయింది. దీనిపై హైకోర్టు ఎలాంటి తీర్పు వెలువరిస్తూ ఉంది అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: