కేంద్ర ప్రభుత్వం మరియు న్యాయస్థానాలు అనేకసార్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కరోనా వైరస్ పరీక్షల విషయంలో ఎక్కువ నిర్ధారణ పరీక్షలు జరపాలని అనేకసార్లు మొట్టికాయలు వెయ్యడం జరిగింది. అయినా గాని ప్రభుత్వం నుండి సరైన స్పందన రాలేదు. ఇదే విషయాన్ని చాలామంది తెలంగాణ ప్రభుత్వ అధికారులు మరియు వైద్యులు కూడా మీడియా ముందు కామెంట్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం లాక్ డౌన్ పై ఆంక్షలు సడలింపులు ఎక్కువ ఇస్తున్న తరుణంలో హైదరాబాద్ నగరంలో భయంకరంగా వైరస్ వ్యాప్తి చెంది ఉందని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ఇటీవల హైదరాబాద్ నగరంలో హాస్పిటల్ కి వెళ్లి చాలా మంది కరోనా వైరస్ అంటించుకుని తిరిగి ఇంటికి రావడం ఆ తర్వాత ప్రాణాలు కోల్పోవడం జరిగింది అని ఇటీవల కొని కేసుల రిపోర్ట్స్ లో ఫలితాలు తెలియజేస్తున్నాయి.

 

ఇటీవల సత్తెనపల్లికి చెందిన ఓ వ్యక్తి గుండె జబ్బు కారణంగా హాస్పిటల్ లో చేరి చికిత్స తీసుకుంటు మరణించగా ఆయన మృతదేహన్ని సొంతూరు తీసుకెళ్లాక అనుమానం వచ్చిన టెస్టులు చేస్తే కానీ ఆయనకు కోవిడ్ సోకిన విషయం తెలియలేదు. ఇతనే కాదు గ్రీన్ జోన్ జిల్లాగా ఉన్న యాదాద్రిలోని రాజాపేటకు చెందిన ఓ నిండు గర్భిణి కూడా హైదరాబాద్‌‌లో ప్రసవం తర్వాత చనిపోయింది. టెస్టులు చేయగా ఆమెకు కరోనా సోకినట్లు తేలింది.

 

అలాగే మరి కొన్ని జిల్లాలకు చెందిన కొన్ని కేసులు హైదరాబాద్లో చికిత్స చేయించుకున్న వారు ట్రీట్మెంట్ మొత్తం అయిన తర్వాత కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తుంటే పాజిటివ్ రిపోర్ట్ లు వస్తున్నాయట. దీంతో ఇప్పుడు హైదరాబాద్ చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల పరంగా హైదరాబాద్ అంటే వణికిపోయే పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా కరోనా వైరస్ బాగా బలపడుతున్నట్లు వార్తలు రావడంతో చాలామందిలో ఆందోళన వ్యక్తమవుతోంది. కాబట్టి ప్రజెంట్ పరిస్థితుల్లో ఎవ్వరూ కూడా హైదరాబాద్ వెళ్లకపోవటం బెటర్ అన్న టాక్ బలంగా వినబడుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: