ఏపీ విద్యార్థులకు జగన్ సర్కార్ మరో శుభవార్త చెప్పింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పిల్లల చదువులకు ఆటంకం లేకుండా కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి 1 - 10 తరగతులకు దూరదర్శన్‌ సప్తగిరి ఛానల్‌ ద్వారా పాఠాలు ప్రసారం చేయనుంది. 1 - 5 తరగతులకు బ్రిడ్జి కోర్స్, 6 - 9 క్లాసెస్ స్టూడెంట్ల‌కు సబ్జెక్టు లెస‌న్స్ బోధిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. పిల్లలకు వచ్చే సందేహాలను నివృత్తి చేసుకోవడానికి టీచ‌ర్స్ వారానికి ఒక‌సారి పాఠశాలలకు రానున్నారని తెలిపింది. 
 
ప్రభుత్వం 1 నుంచి 5వ త‌రగ‌తి స్టూడెంట్స్ కోసం స్పెష‌ల్ గా రూపొందించిన‌ బ్రిడ్జి కోర్సు పుస్తకాలను వారికి అందించనుంది. ఇంగ్లీషు మీడియం విధానంలోనే ఇంగ్లీషు, మ్యాథ్స్ బోధన జరుగుతుంది. 1, 2 తరగతులకు ఉదయం 11 గంటల నుంచి 11.30 వరకు... 3, 4, 5 తరగతులకు 11.30 గంటల నుంచి 12 గంటల వరకు.... 6, 7 తరగతులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు.... 8, 9 తరగతులకు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తరగతులు టెలికాస్ట్ అవుతాయి.

 

ఒకటి నుంచి 5 తరగతులకు పాఠాలు బోధించే టీచర్లు ప్రతి మంగళవారం పాఠశాలకు హాజరు కావాల్సి ఉంటుంది. 6 - 7 తరగతుల హెచ్.ఎమ్, టీచ‌ర్స్ 17వ తేదీ నుంచి ప్రతి బుధవారం పాఠశాలలకు వెళ్లాల్సి ఉంటుంది. 8 - 9 తరగతులకు పాఠాలు చెప్పే టీచ‌ర్స్ 19 నుంచి ప్రతి శుక్రవారం... పదో తరగతి ఉపాధ్యాయులు ప్రతి బుధవారం, శుక్రవారం స్కూళ్ల‌కు వెళ్లాల్సి ఉంటుంది. ప్రభుత్వం విద్యార్థులకు టీవీ పాఠాలు చెప్పాలని తీసుకున్న నిర్ణయం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం  చేస్తున్నారు.         

మరింత సమాచారం తెలుసుకోండి: