విశాఖపట్టణం ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ ఘటన విశాఖపట్టణం ని మాత్రమే కాదు అప్పట్లో దేశాన్ని వణికించింది. లాక్ డౌన్ టైమ్ లో అందరూ నిద్రపోతున్న సమయంలో ఎల్జి పాలిమర్స్ కంపెనీ నుండి రిలీజ్ అయిన డెంజరస్ స్టైరీన్ గ్యాస్ పిల్చుకొని చాలామంది అస్వస్థతకు గురైన సంగతి అందరికీ తెలిసిందే. దాదాపు ఘటన జరిగిన టైములో 12 మంది మరణించగా వందలాది మంది క్షతగాత్రులు అయ్యి స్పృహతప్పి హాస్పిటల్ లో జాయిన్ అవ్వడం మృతులకు మరియు బాధితులకు నష్ట పరిహారం ప్రభుత్వం భారీ స్థాయిలో ఇవ్వటం మనకందరికీ తెలిసిందే.

IHG't Go Off During <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=VISAKHAPATNAM' target='_blank' title='vizag-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>vizag</a> Gas Leak, Says Andhra ...

ఇదిలా ఉండగా తాజాగా గ్యాస్ లీకేజీ మృతుల సంఖ్య ఉన్న కొద్దీ పెరుగుతుండటంతో వైజాగ్ వాసులలో భయాందోళన నెలకొంది. ముఖ్యంగా కొద్ది మోతాదులో పీల్చిన వారిపై స్టైరీన్ గ్యాస్ ప్రభావం దీర్ఘకాలం ఉంటుందని వైద్య నిపుణులు మరియు శాస్త్రవేత్తలు హెచ్చరించిన తరుణంలో తాజాగా మృతుల సంఖ్య పెరుగుతుండటంతో వైజాగ్ వాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు.

IHG

ఈ నేపథ్యంలో చాలా మంది స్థానికులు ప్రభుత్వం తమకు లైఫ్ లాంగ్ హెల్త్ కార్డులు ఇవ్వాలని మరియు ఏ చిన్న రోగం వచ్చినా ఉచిత వైద్యం అందేలా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ వచ్చి హామీ ఇవ్వాలని ఉన్న కొద్ది మృతుల సంఖ్య పెరుగుతున్న కారణంగా వైజాగ్ వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే డిమాండ్ వైసీపీ పార్టీ నుండి కూడా వినపడుతోంది. ఒకసారి వైయస్ జగన్ వైజాగ్ వచ్చి భరోసా ఇస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నారు. లేకపోతే డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు అనే విమర్శ పార్టీపై పడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: