నిజంగా కరోనా ప్రభావమో.. లేక ఏదైనా పైత్యమో కానీ కొంత మంది మనుషులు మనం సమాజంలో ఉంటున్నాం.. ఈ పని చేస్తే ఛీదరించుకుంటారన్న బుద్దీ.. జ్ఞానం పూర్తిగా మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు.   కరోనా వల్ల మనుషుల ప్రాణాలు పోవడం సంగతి పక్కనబెడితే.. మనిషులు చేస్తున్న కృరమైన చర్యలకు మనం నివసిస్తున్న సమాజం భవిష్యత్ లో ఎలా మారుతుందో  అన్న భయాలు కలుగుతున్నాయి.  కేరళలో ఏనుగును కొందరు దుండగులు హతమార్చిన వైనంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. గర్భంతో ఉన్న ఏనుగు మరణం దేశ వ్యాప్తంగా కలకలం రేకెత్తిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసు విచారణ సందర్భంగా పలు అంశాలు వెలుగు చూశాయి.

 

 కేరళలో మరో ఘోరం జరిగింది. కుక్క మూతికి దుర్మార్గులు టేపు చుట్టి హింసించారు. రెండు వారాలుగా అది తిండినీళ్లు లేక అల్లాడిపోయింది. త్రిస్సూర్ లోని ఒల్లూరు చౌరస్తాలో తిరుగుతుండగా జంతుహక్కుల కార్యకర్తలు కాపాడి చికిత్స అందిస్తున్నారు. ఇప్పుడు మరో ఘోరానికి తలపడ్డారు దుర్మార్గులు. కేరళలో జరిగిన ఏనుగు సంఘటన మరువక ముందే తాజాగా తమిళనాడులో మరో దారుణం జరిగింది.  త‌మిళ‌నాడులోని ట్రిచీలో ఓ న‌క్కను పట్టుకోవడానికి కొందరు మాటు వేశారు. నక్క సమీపంలో మాంసం పెట్టి అందులో బాంబు పెట్టారు.

 

మాంసంలో బాంబు ఉందని తెలియక నక్క దానిని తిన్నది. దీంతో నక్క నోట్లో బాంబు పేలి అక్కడికి అక్కడే చ‌నిపోయింది. తరువాత వారు నక్క మృత‌దేహాన్ని సంచిలో వేసుకుని స‌మీపంలో ఉన్న ఓ టీ స్టాల్ వ‌ద్ద‌కు వ‌చ్చి టీ తాగసాగారు.  ఓ పోలీస్ కానిస్టేబుల్ వారిని విచారించాడు. దీంతో అస‌లు విష‌యం బ‌య‌ట ప‌డింది. దీంతో నక్క చావుకి కార‌ణమైన మొత్తం 12 మంది నిందితుల‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు. వారు ఆ నక్క‌ను దాని దంతాలు, మాంసం కోసం చంపిన‌ట్లు పోలీసుల విచారణలో అంగీక‌రించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: