తెలుగు దేశం ఓ ప్రాంతీయ పార్టీ.. ప్రాంతీయ పార్టీల్లో అధ్యక్షుడి నిర్ణయాలే ఫైనల్. అందులోనూ ప్రాంతీయ పార్టీల్లో కుటుంబ రాజకీయాలు ఎక్కువ. తెలుగు దేశం పరిస్థితి కూడా అదే. అందుకే పార్టీలో తన తర్వాత లోకేశ్ కు పగ్గాలు అప్పగించాలని చంద్రబాబు భావిస్తున్నా ఎవరూ అభ్యంతరం చెప్పలేని పరిస్థితి. మరి అలాంటిది.. తెలుగు దేశం అధ్యక్ష పదవి కోసం లోకేశ్ కుట్ర చేయాల్సిన అవసరం ఏముంది.. అన్న సందేహం రావచ్చు.

 

 

అయితే ఇక్కడ లోకేశ్ కుట్ర చేస్తున్నది పార్టీలో జాతీయ అధ్యక్ష పదవి కోసం కాదు.. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం అన్న విమర్శ వినిపిస్తోంది. ప్రస్తుతం ఆ పదవిలో కళా వెంకట్రావు ఉన్నారు. ఆయన పేరుకే ఆ పదవిలో ఉన్నారు. పెత్తనం అంతా చంద్రబాబుదే అన్న సంగతి తెలిసిందే. అయితే.. ఓడిపోయారనే కారణాలతో కళా వెంకట్రావుని పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని లోకేష్‌ కుట్రలు చేస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు.

 

 

లోకేష్‌ నాయకత్వాన్ని ఆ పార్టీలోని ఎమ్మెల్యేలు కూడా కోరుకోవడం లేదని మంత్రి అవంతి శ్రీనివాస్ ఆరోపించారు. ఎల్జీ పాలిమర్స్‌ ఘటన జరిగిన తర్వాత బాధితులని లోకేష్‌ ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను చంద్రబాబు దిగజార్చితే.. ఆయన తనయుడు లోకేష్‌ ఆ పార్టీనే భ్రష్టుపట్టించాడని మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. ఎమ్మెల్యేగా కూడా గెలవలేని వ్యక్తికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే అర్హత లేదన్నారు.

 

 

చంద్రబాబు, లోకేష్‌ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు మంత్రి అవంతి. గత ఐదేళ్లు రాష్ట్రంలో జరిగిన అవినీతి, అక్రమాలకు లోకేష్‌ కారణమని ధ్వజమెత్తారు. చంద్రబాబు, లోకేష్‌ సోషల్ మీడియాకే పరిమితమయ్యారని మంత్రి అవంతి శ్రీనివాస్‌ ఎద్దేవా చేశారు. లోకేష్‌ చేసే పనికిమాలిన విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారాయన.

 

మరింత సమాచారం తెలుసుకోండి: