కేరళ రాష్ట్రం లోని పాలక్కాడ్‌లో గర్భిణీ ఏనుగు మరణించిన సంఘటన మరువకముందే అస్సాం లోని కాచర్ జిల్లాలోని ఒక జలాశయం లో 13 కోతులు అనుమానాస్పద స్థితిలో చనిపోయి దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. పూర్తి వివరాలు తెలుసుకుంటే ఆదివారం మధ్యాహ్నం పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన కటిరైల్ నీటి సరఫరా కర్మాగారంలోని రిజర్వాయర్‌లో 13 కోతుల మృతదేహాలు లభ్యమయ్యాయని ఒక అధికారి తెలిపారు.


ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం... అస్సాంలోని కాచర్ జిల్లాలోని ఒక జలాశయంలో ఒక కోతి మృతదేహాన్ని కొంతమంది గమనించారు. దాంతో ఆ కోతి మృతదేహాన్ని వెలికి తీయాలంటూ ప్లాంటు అధికారులకు తెలియజేయగా... జలాశయం వద్దకు వచ్చిన ఆ అధికారులకు మొత్తం 13 కోతి మృతదేహాలు రిజర్వాయర్‌లో విగత జీవులుగా తేలుతూ కనిపించాయి. దాంతో వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. జలాశయంలో ఎవరో కావాలనే విషపూరితమైన ద్రవపదార్థాలను వదిలి ఉంటారని అక్కడి అధికారులు అనుమానిస్తున్నారు. 


ఈ జలాశయం నుండే దాదాపు 350 కుటుంబాలు నీటి అవసరాల తీర్చుకుంటున్నారు. అయితే ప్రస్తుతం వారంతా విషంతో కలుషితమైన విషపు నీరు తెలియకుండా వినియోగించినందున తమకు ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనని బాగా భయపడుతున్నారు. మరణించిన కోతుల భౌతిక కాయలను అటవీ అధికారులు ఆసుపత్రికి తరలించగా ఫోరెన్సిక్ నిపుణులు పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. పోస్టుమార్టం నివేదికలు వచ్చిన అనంతరం కోతుల మరణంపై ఒక క్లారిటీ వస్తుందని కటిరైల్​ నీటి సరఫరా ప్లాంటు అధికారి చెప్పుకొచ్చాడు. కేరళ రాష్ట్రంలో గుర్తుతెలియని కొంతమంది ఒక శునకం నోటికి గట్టిగా గుడ్డ కట్టి... అది రెండు వారాల పాటలు ఆహారం తినకుండా చేసి మానవులు ఎంతగా దిగజారుతున్నారో చెప్పకనే చెప్పారు. ఇటీవలే గోహతి లో ఒక పులిని అత్యంత కిరాతకంగా చంపి... పళ్ళు గోర్లు రాక్షసులా పీక్కున్న సంఘటన మానవత్వం ఏమవుతుందో అనే ఆందోళనను ప్రజల్లో కల్పించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: