తమ రాజకీయ ప్రత్యర్ధి ఎంతటి బలవంతుడు అనే విషయాన్ని సైతం పక్కనపెట్టి తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా టిఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్, ఆయన కుమారుడు మంత్రి కేటీఆర్ ను ఇరుకున పెట్టడమే ధ్యేయంగా రేవంత్ అడుగులు వేస్తున్నారు. ఈ విషయంలో మొదటి నుంచి పోరాటం చేస్తూ వస్తున్నారు. పార్టీలోని ఇతర నాయకులు తమకు సహకరించినా, సహకరించకపోయినా పర్లేదు అన్నట్లుగా రేవంత్ దాదాపు ఒంటరి పోరాటం చేస్తున్నారు. ముఖ్యంగా కేటీఆర్ అవినీతిని బయట పెట్టాలని ఉద్దేశంతో కొద్ది రోజుల క్రితం రేవంత్ హడావుడి చేశాడు. జన్వాడ ప్రాంతంలో ఉన్న ఫామ్ హౌస్ కేటీఆర్ అక్రమంగా, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారు అంటూ ప్రకటించి హడావుడి చేశారు. 


ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన జైలు జీవితం గడపాల్సి వచ్చింది. అయినా వెనక్కి తగ్గకుండా ఇప్పుడు ఆ విషయంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో పిటిషన్ వేయడం కేటీఆర్ కు నోటీసులు అందించడం, దీనిపై రెండు నెలల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని ఒక ప్రత్యేక కమిటీని ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వ్యవహారంలో అధికారపర్టీ బలం పుంజుకుంటున్నట్టుగా కనిపిస్తుండడంతో కాంగ్రెస్ అధిష్టానం కూడా ఇప్పుడు దృష్టిసారించింది. మిగతా నాయకులతో పోలిస్తే రేవంత్ కెసిఆర్, కేటీఆర్ ను ఎదుర్కోగల సమర్థులైన నాయకుడు రేవంత్ మాత్రమే అని, నాయకత్వంలో తెలంగాణ కాంగ్రెస్ బాగా బలపడుతుందని ఒక అభిప్రాయానికి కాంగ్రెస్ అధిష్టానం వచ్చినట్లు తెలుస్తోంది.

IHG


 ఇప్పటికే తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవి భర్తీ చేయాలని అధిష్టానం చాలా కాలంగా వేచి చూస్తోంది. దీని కోసం అనేక మంది నాయకుల పేర్లను పరిగణలోకి తీసుకుంది. దాదాపు ఒక సందర్భంలో రేవంత్ పేరు ఫైనల్ అయినా మిగతా కాంగ్రెస్ సీనియర్లు తీవ్రంగా అభ్యంతరం చెప్పడంతో అధిష్టానం వెనక్కి తగ్గింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తుండడం, అధికార పార్టీని ముప్పుతిప్పలు పెట్టేలా ఆయన వ్యూహాలు రచించగలరు అనే అంశాలను కాంగ్రెస్ అధిష్టానం పరిగణలోకి తీసుకుని కొత్త పిసిసి అధ్యక్షుడిగా ఆయనకు అవకాశం కల్పించి పార్టీకి తిరిగి పునర్వైభవం తీసుకు రావాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి కొద్ది రోజుల్లోనే పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ పేరు ఫైనల్ చేసి ప్రకటించే దిశగా అధిష్టానం అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: