ఈ మద్య కొంత మనుషులు మృగాళ్లుగా రెచ్చిపోతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆడవారు కనిపిస్తే చాటు కామపిశాచులు కామంతో రెచ్చిపోతున్నారు.  ప్రతిరోజూ అత్యాచారాల, హత్యల వార్తలు చదువుతూనే ఉన్నాం.  ఎంతగా అంటా కరోనాతో జనాలు చచ్చిపోతున్నా కూడా.. క్వారంటైన్ లో ఉన్నవారిపై కూడా మృగాళ్లు రెచ్చిపోతున్నారు.  ఇది చాలదని ఇప్పుడు రాక్షసుల్లా మూగ జీవాలపై పడుతున్నారు. కేరళలో ఏనుగును కొందరు దుండగులు హతమార్చిన వైనంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. గర్భంతో ఉన్న ఏనుగు మరణం దేశ వ్యాప్తంగా కలకలం రేకెత్తిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసు విచారణ సందర్భంగా పలు అంశాలు వెలుగు చూశాయి. అటవీ శాఖ అధికారులు ఒకరిని అరెస్ట్ చేశారు. ఆవుకు బాంబు పెట్టారు.. దాంతో నోరు పగిలిపోయింది.  

 

ఆ తర్వాత కుక్క మూతికి ప్లాస్టీక్ చుట్టడంతో ఆకలితో అలమటించిపోయింది. మూగజీవి మూతికి టేపులను బలంగా అంటించారని పాస్ కార్యదర్శి రామచంద్రన్ చెప్పారు. ‘అవి చర్మాన్ని కోసేశాయి. రక్తగాయాలయ్యాయి. టేపులు విప్పగానే కుక్క రెండు లీటర్ల నీళ్లు తాగింది…’ అని వెల్లడించారు. దాని మెడకు కాలర్ ఉందని, బహుశా అరవకుండా టేప్ అంటించి ఉంటారని చెప్పారు. పోలీసులు ఈ ఉదంతంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. తాజాగా కేరళలో మరో ఏనుగు చనిపోయింది. కాకపోతే అది ఇతర ఏనుగులతో పోట్లాడటం వల్ల గాయపడిందని అంటున్నారు.

 

ఉత్తర నీలాంబుర్ అడవుల్లో తీవ్ర గాయాలతో పడి ఉన్న ఏనుగును అటవీ శాఖ అధికారులు కాపాడారు. దానికి అవసరమైన చికిత్సను అందిస్తూ గత ఐదు రోజులుగా కాపాడుకుంటూ వచ్చారు. అయితే ఏనుగు కోలుకోలేదు. చికిత్స పొందుతూ చనిపోయినట్లు వెటర్నరీ వెద్యులు వెల్లడించారు. అనంతరం ఆ ఏనుగు మృతదేహాన్ని తగులబెట్టారు. తీవ్ర గాయాలతో అడవిలో పడి ఉన్న ఏనుగును స్థానికులు గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.  ఎంత ప్రయత్నించినా ఏనుగును కాపాడలేకపోయామన్నారు.


 

మరింత సమాచారం తెలుసుకోండి: