ప్రస్తుతం దేశంలోకరోనా వైరస్ బీభత్సం సృష్టిస్తుంది.  చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ఎవ్వరినీ వదలడం లేదు.  అయితే కరోనా వైరస్ ని అరికట్టే బాధ్యత మనపైనే ఉంది.  అందుకోసం సోషల్ డిస్టెన్స్ పాటించాలి.. ఖచ్చితంగా మాస్క్ ధరించాలి.. బయటకు వెళ్లినా.. వచ్చినా.. శానిటైజర్ తప్పకుండా వాడాలి అని అంటున్నారు. ఈ మద్య కొంత మంది రాజకీయ నాయకులు ఇవేవీ పట్టనట్టుగా ఉంటున్నారు.  అంతే కాదు తమ పుట్టిన రోజు వేడుకలను మహా గొప్పగా నిర్వహిస్తూ గుంపులు గుంపులు గా ఉంటూ రూల్స్ బ్రేక్ చేస్తున్నారు.  తాజాగా కరోనా నిబంధనలను అతిక్రమిస్తూ హైవేపై పుట్టినరోజు వేడుకలకు హాజరైనందుకు ఓ మాజీ ఎమ్మెల్యేతో పాటు పలువురిని పోలీసులు అరెస్టు చేశారు.

 

లాక్‌డౌన్ నిబంధనలను పట్టించుకోకుండా ఉత్తరప్రదేశ్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఓ వ్యక్తి పుట్టినరోజు వేడుకలు జరుపుకొంటున్నాడు. స్థానిక సమాజ్‌వాదీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే భగవాన్ శర్మతో పాటు మరో 20 మంది వరకు హాజరయ్యారు. ఈ విషయం కాస్త పోలీసుల చెవిన పడటంతో వెంటనే అక్కడికి చేరుకున్నారు.. అప్పటికే ఎమ్మెల్యే మనుషులు హైవేపై ఆయుధాలు పట్టుకొని మరీ నానా హంగామా చేస్తూ కనిపించారు.  దాంతో వారందరిపై కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. 

 

కాగా, దక్షిణ ముంబైలోని నాగ్‌పడాలో కూడా కొన్ని రోజుల ముందు ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. తనకుతాను సామాజిక కార్యకర్తగా చెప్పుకునే హమ్మద్ అన్సారీ(22) తన బర్త్ డే వేడుకల వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు.  కరోనా, లాక్‌డౌన్ ఉన్నా తన బర్త్ డేను ఎంత ఘనంగా జరుపుకున్నానో చూడాలని ఎఫ్బీలో స్టేటస్ పెట్టాడు. మరికొంత మంది నేతలు బాణా సంచాలు పేలుస్తూ.. ఏమాత్రం భౌతిక దూరం పాటించకుండా తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు.  పది మందికి ఆదర్శంగా నిలిచి చెప్పాల్సిన నేతలే ఇలా ప్రవర్తిస్తే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. 

మరింత సమాచారం తెలుసుకోండి: