ప్రపంచ దేశాలలో కొన్ని విషయాల్లో ఏ దేశానికి లేని ప్రత్యేకతలు భారత్ కు సొంతం. భిన్నత్వంలో ఏకత్వంను అనుసరించే భారత్ అవకాశం వచ్చినప్పుడల్లా మానవతా విలువలను చాటుకుంటూ ఉంటుంది. కరోనా విజృంభణ సమయంలో పదుల సంఖ్యలో దేశాలకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ను మన దేశం పంపిణీ చేసింది. మిత్ర దేశాలతో పాటు శత్రు దేశాల విషయంలో భారత్ ఎల్లప్పుడూ సౌమ్యంగా వ్యవహరిస్తుంది. 
 
ప్రపంచానికి భారతదేశం ఏం ఇచ్చింది...? అనే ప్రశ్నకు ఆరు ముఖ్యమైన విషయాల గురించి మనం మాట్లాడుకోవాలి. అందులో మొదటిది యోగా. స్వామి వివేకానంద పశ్చిమ దేశాలకు 1863 - 1902 మధ్య కాలంలో పరిచయం చేశారు. మొదట్లో యోగాను ఎవరూ పట్టించుకోలేదు కానీ ప్రస్తుతం విదేశాలలో యోగాకు ప్రాముఖ్యత పెరిగింది. దేశంలో మోదీ అధికారంలోకి వచ్చాక జూన్ 21ను యోగా దినోత్సవంగా ప్రకటించారు. ప్రపంచానికి మనం ఆరోగ్య సూత్రాలలో భాగంగా యోగాను ఇచ్చాం. 
 
ప్రపంచం ఈ విషయాన్ని అంగీకరించనప్పటికీ భారత్ రేడియో ప్రసారాలను ప్రపంచ దేశాలకు పరిచయం చేసిందనటం నిజం. మార్కోని రేడియోని కనిపెట్టినప్పటికీ అంతకు ముందే భారతీయ శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్ మిల్లీమీటర్ శ్రేణి రేడియో తరంగాలను రూపొందించారు. ప్రపంచానికి ఫైబర్ ఆప్టిక్స్ ను పరిచయం చేసింది కూడా భారత్ కావడం గమనార్హం. ప్రస్తుతం ఇంటర్నెట్ లేని ప్రపంచాన్ని ఎవరూ ఊహించలేరు. పంజాబ్ కు చెందిన నరేందర్ సింగ్ కపాలి ఫైబర్ ఆప్టిక్స్ ను కనిపెట్టారు. 
 
భారతదేశానికి చెందిన శాస్త్రవేత్తలే యూ.ఎస్.బీ పోర్ట్ ను కనిపెట్టారు. 1990 లో దీనిని కనిపెట్టగా 2009 తర్వాత ప్రపంచవ్యాప్తంగా దీనికి గుర్తింపు వచ్చింది. ప్రపంచానికి భారత్ పరిచయం చేసిన వాటిలో ముఖ్యమైంది షాంపూ. ఫ్లష్ టాయిలెట్ సింధూ నాగరికత కాలం నుంచి భారత్ లో వాడినట్లు ఆధారాలు ఉన్నాయి. ఈ ఆరింటిని భారతదేశం ప్రపంచదేశాలకు అందించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: