తెలంగాణ రాష్ట్రంలో నిన్న పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. తెలంగాణ బాటలో తమిళనాడు రాష్ట్రం కూడా పరీక్షలు రద్దు చేసింది. ఏపీలో పరీక్షలు నిర్వహిస్తారా...? లేదా....? అనే ప్రశ్నకు సమాధానం తెలియాలంటే మాత్రం కొంతకాలం ఆగాల్సిందే. ఏపీ ప్రభుత్వం జులై నెలలో వరుసగా ఆరురోజులపాటు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. 
 
పరీక్షలకు నెల రోజుల సమయం ఉండటంతో ఇప్పట్లో ఈ ప్రశ్నకు సమాధానం దొరకడం కష్టమే అని చెప్పవచ్చు. ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో జులై నాటికి నెలకొన్న పరిస్థితులను బట్టి కరోనా విషయంలో నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు రద్దు చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు తల్లిదండ్రులు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తుంటే మెజారిటీ శాతం తల్లిదండ్రులు మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. 
 
ప్రభుత్వం ఎలాగోలా 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తేనే మేలని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి విద్యార్థికి పదో తరగతి మార్కులు జీవితకాలం పనికి వస్తాయి. పదవ తరగతిలో వచ్చే మార్కులు విద్యార్థి జీవితంలో ప్రాథమికం. విద్యార్థికి జీవితంలో పదవ తరగతి సర్టిఫికెట్ బేసిక్ సర్టిఫికెట్ అవుతుంది. చదువుకునే ప్రతిభావంతులు నష్టపోయే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 
పరీక్ష ఏదో ఒక విధంగా.... విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా... నిర్వహించి ఉంటే బాగుండేదనే మెజారిటీ శాతం ప్రజలు కోరుతున్నారు. కొంతమంది తల్లిదండ్రులు మాత్రం కరోనా కష్ట కాలంలో పరీక్షలను రద్దు చేయడమే కరెక్ట్ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల్లో మాత్రం మెజారిటీ శాతం విద్యార్థులు పరీక్షల రద్దును సమర్థిస్తుండగా కొందరు విద్యార్థులు మాత్రం పరీక్షలు నిర్వహించి ఉంటే బాగుండేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.                               

మరింత సమాచారం తెలుసుకోండి: