కరోనా మహమ్మారి...భారతదేశాన్ని దారుణంగా వణికిస్తుంది. ఎన్నిసార్లు లాక్ డౌన్ పెట్టినా కూడా అదుపులోకి రాలేదు. పైగా ఆర్ధికంగా కూడా బాగా నష్టం తీసుకొచ్చేసింది. ఇక ఇలా లాభం లేదని చెప్పి, కేంద్రం లాక్ డౌన్‌లో సడలింపులు ఇచ్చేసింది. ఇక సడలింపులు వచ్చాక కరోనా కేసులు తీవ్రంగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే 2 లక్షల కేసులు దాటేసి 3 లక్షల వైపు వెళుతుంది.

 

ఈ కరోనా ఏపీని కూడా తీవ్రంగా భయపెడుతుంది. ఇప్పటికే 5 వేల కేసులు దాటేశాయి. అయితే కరోనా బారిన పడకుండా ఉండాలంటే స్వీయ జాగ్రత్తలు పాటించడమే రక్షణ అని సీఎం జగన్ ఎప్పుడో చెప్పారు. అలా అని దీని గురించి భయపడకూడదని, తమ జీవితంలో కరోనా భాగమైపోతుందని మాట్లాడారు. రోగనిరోధక శక్తి పెంచుకుంటే కరోనాకు చెక్ పెట్టొచ్చని పలుమార్లు చెప్పారు.

 

అయితే జగన్ వ్యాఖ్యలని ప్రతిపక్షాలు వక్రీకరించి రాజకీయం చేశాయి. ఇక వారు ఎంత రాజకీయం చేసినా చివరికి అందరూ కరోనాతో కలిసి జీవించాలసిన పరిస్తితి వచ్చింది. ఇక పరిస్తితి ఏదైనా సరే సీఎం జగన్ మాత్రం కరోనా కట్టడికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. కరోనా టెస్టులని ఎక్కువ చేస్తున్నారు. కరోనా రోగులని జాగ్రత్తగా చూసుకుంటూ, రోగం త్వరగా తగ్గిపోయేలా చికిత్స అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. కాకపోతే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న కరోనా పెరిగిపోతుంది.

 

దీని వల్ల ఆసుపత్రుల్లో బెడ్స్ కొరత వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే అవకాశం ఉన్నవారికి ఇంట్లోనే చికిత్స అందించేలా జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అయితే ఈ విషయంలో కూడా జగన్ కరోనా నివారణకు కొన్ని కీలక సూచనలు చేశారు. కరోనాతో ఎలా కలిసి బతకాలన్నదే మనం ఆలోచించాలని చెబుతూనే...ఇంట్లోనే మందులు తీసుకోవడం ద్వారా 85 శాతం మందికి తగ్గిపోతుందన్నారు.

 

కరోనా అనుమానం రాగానే పరీక్షలకు ముందుకు వస్తే ఏ ఇబ్బందీ ఉండదని , అలా కాకుండా కరోనాపై నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాలకు ప్రమాదం తీసుకొస్తుందన్నారు. అయితే జగన్ చెప్పింది కరెక్ట్ అని వైద్య నిపుణులు చెబుతున్నారు. రోగనిరోధక శక్తి ఉన్నవారు ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంటే రోగం తగ్గిపోతుందని, అలాగే ముసలివారు, పిల్లలనైతే ఆసుపత్రుల్లో పెట్టడం మంచిదని చెబుతున్నారు. ఇంకా కరోనా లక్షణాలు ఉన్నా సరే అవి మామూలు జ్వరం అని లైట్ తీసుకుంటే, వారితో పాటు, వారి సన్నిహితుల జీవితాలు రిస్క్‌లో ఉన్నట్లే అని అంటున్నారు. కాబట్టి అనుమానం రాగానే టెస్ట్ చేయించుకుంటే ఎలాంటి రిస్క్ ఉండదని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: