ఏంటో చంద్రబాబుకు వయసు పెరిగే కొద్దీ చాదస్తం ఎక్కువ అవుతున్నట్లు కనిపిస్తోంది. వైసీపీ ప్రభుత్వంపై ఎంత నెగిటివ్ ప్రచారం చేసినా, అది జనాల్లోకి వెళ్లకపోయేసరికి బాగా ఫ్రస్టేట్ అయిపోయి ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియడం లేదు. అసలు ఆయన 2019 ఎన్నికల్లో ఓడిపోతానని తెలిసిన దగ్గర నుంచి అలాగే మాట్లాడుతూ జనాలకు పిచ్చి లేపుతున్నారు.

 

అప్పట్లో బీజేపీ నుంచి విడిపోవడంతో వరుసగా టీడీపీ నేతలపై ఐటీ దాడులు జరిగాయి. ఇక ఇదే విషయంపై బాబు మాట్లాడుతూ...తనని కూడా బీజేపీ జైలుకు పంపే ప్రయత్నం చేస్తుందని, తనని జైలుకు వెళ్లకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదే అని మాట్లాడారు. ఇక ఆ మాటలకు జనాల మైండ్ సగం పోయి ఉంటుంది. దాంతోనే బాబుని ఎన్నికల్లో చిత్తుగా ఓడించారు.

 

ఇక ఓడిపోయాక కూడా జగన్ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని ఓ ఫైర్ అయిపోతూ...వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే పాలిచ్చే ఆవుని వదులుకుని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నారు అనుభవించండి అంటూ జనాలపై ఫ్రస్టేషన్ చూపించారు. ఆ విధంగా ఆయన చాదస్తంతో ప్రజలపైనే విమర్శలు చేసే రేంజ్‌కు వెళ్ళిపోయారు.

 

అయితే ఈయన చాదస్తానికి పరాకాష్టగా తాజాగా జనాలు ఇంట్లో ఉంటూ ప్లకార్డులు పట్టుకుని ధర్నాలు చేయాలని మాట్లాడారు. తాజాగా కరెంట్ బిల్లులపై మాట్లాడుతూ... జగన్ ప్రభుత్వం విద్యుత్ బిల్లులు పెంచేసి పేదల జీవితాలను దుర్భరం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంటు బిల్లుల పెంపుపై ఇళ్లలోనే ఉంటూ ప్లకార్డులతో నిరసన తెలపాలని పిలుపునిచ్చారు.

 

ఇప్పటికే జనాలు కరోనా ప్రభావంతో వచ్చిన లాక్ డౌన్ వల్ల నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులని ఎలా సరిచేసుకోవాలని వారు కష్టపడుతుంటే, బాబు ఏమో ఇంట్లో ఉండి ధర్నాలు చేయాలని మాట్లాడుతున్నారు. పైగా కరెంట్ బిల్లులపై ప్రభుత్వం క్లారిటీ కూడా ఇచ్చింది. దీనిపై ప్రస్తుతం ప్రజలకు ఎలాంటి అభ్యంతరం లేదు. అలాంటిది బాబు చాదస్తంతో ప్రజలకు వేరే పని లేనట్లు ప్లకార్డులు పట్టుకుని కూర్చోవాలని ఉపయోగం లేని మాటలు మాట్లాడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: