ఏపీ సీఎం జగన్ మద్య నిషేధం దిశగా మొదటి నుంచి ఆలోచన చేస్తున్నారు. విడతలవారీగా మద్యనిషేధం అని ఆయన ఇప్పటికే మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఆ మేరకు క్రమంగా అడుగులు వేస్తున్నారు. లిక్కర్‌ వినియోగం తగ్గించడానికి అనేక చర్యలు తీసుకున్నారు. అధికారంలోకి రాగానే 43 వేల బెల్టుషాపులు ఎత్తివేశారు. 33 శాతం మద్యం దుకాణాలు తగ్గించారు. మందు అంటే చాలు షాక్‌ కొట్టే రీతిలో రేట్లు పెంచారు.

 

 

నిజానికి ఇవన్నీ చేయడం ఓ సాహసం. రాష్ట్ర ఆదాయాన్ని పణం పెట్టి మరీ జగన్ ఈ నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ఇదే సమయంలో దీన్ని అడ్డం పెట్టుకుని కొందరు అక్రమ మద్యం రవాణా ద్వారా కోట్లు గడిస్తున్నారు. రాష్ట్రంలో భారీగా అక్రమ మద్యం సీసాలు దొరుకుతున్నాయి. మరి ఇలాగైతే ఫలితం ఏముటుంది. అందుకే ఈ తీరుపై సీఎం జగన్ మండిపడ్డారు. మద్యం, ఇసుక అక్రమాల్లో ఎవరు ఉన్నా కూడా ఉపేక్షించవద్దని సీఎం వైయస్‌ జగన్‌ అధికారులకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు.

 

 

సహజంగానే మద్యం, ఇసుక దందా వంటి విషయాల్లో అధికార పార్టీ నేతల హస్తం ఎక్కువగా ఉంటుంది. అందుకే అధికారులు ఇలాంటి విషయాల్లో చర్యలు తీసుకోవాలంటే కాస్త వెనుకంజ వేస్తారు. కానీ ఈ విషయంలో ఎలాంటి వివక్ష వద్దని జగన్ సీరియస్ గా చెప్పేశారు.

మద్యం, ఇసుక అక్రమాల్లో ఎవరు ఉన్నా .. అది వైసీపీ నేతలైనా సరే ఉపేక్షించవద్దని సీఎం వైయస్‌ జగన్‌ అధికారులకు తేల్చి చెప్పేశారు.

 

 

ఇదే సమయంలో ఇసుకపైనా సీఎం జగన్ మాట్లాడారు. రీచ్‌లను ఓపెన్‌ చేయాలని, వర్షాలు వచ్చే నాటికి 70 లక్షల మెట్రిక్‌ టన్నుల ఇసుక నిల్వ చేయాలని కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులను జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. జూన్‌ చివరి నాటికి రోజుకు 3 లక్షల టన్నుల ఇసుక లక్ష్యం పెట్టుకోవాలన్నారు. శ్రీకాకుళం, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో ఇసుక ఉత్పత్తిని పెంచాలన్నారు. కొత్త సోర్స్‌లను గుర్తించి ఇసుక రీచ్‌లు ఏర్పాటు చేయాలని జగన్ ఆదేశించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: