2014 ఎన్నికల సమయములో విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు జలీల్ ఖాన్. ఆ తర్వాత చంద్రబాబు హయాంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొని వైసీపీ నుండి జంప్ అయిపోయారు. కాంగ్రెస్ పార్టీ టైములో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి కి అనుచరుడుగా ఉన్న జలీల్ ఖాన్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జగన్ తో రాజకీయాలు చేయడం జరిగింది. 2014లో గెలిచిన గానీ అధికారం  టీడీపీ దగ్గర ఉండటం తో పార్టీ జంప్ అయిపోయారు. మంత్రి పదవి ఇస్తారని ఆశతో టీడీపీ లోకి వెళ్లి బీకాం లో ఫిజిక్స్ చేశాను అన్న వ్యాఖ్యలకు నవ్వులపాలు అవడంతో మంత్రి పదవి రాకుండా పోయింది. మంత్రి పదవి రాకపోయినా గాని బీకాం లో ఫిజిక్స్ డైలాగ్ తో రాష్ట్రవ్యాప్తంగా హైలైట్ అయ్యారు.

 

గతంలో విజయవాడ పాలిటిక్స్ లో తన హవా చాటుకున్న జలీల్ ఖాన్ ప్రస్తుత పరిస్థితి, చాలా దయనీయంగా ఉన్నట్లు విజయవాడ రాజకీయాలలో వార్తలు వస్తున్నాయి. విజయవాడలో ఆయన హవా తగ్గిపోయినట్లు ఎక్కడా కూడా పెద్దగా కనిపించడం లేదు అని బెజవాడ రాజకీయ నేతలు లోలోపల చర్చించుకుంటున్నారు. ఇదే టైంలో ఎంపీ కేశినేని నాని వర్గంలో జలీల్ ఖాన్ చేరటంతో అనుచరవర్గం మైనారిటీలు కూడా ఆయనకు దూరం అయినట్లు వార్తలు అందుతున్నాయి.

 

మరోపక్క విజయవాడ వెస్ట్ లో జలీల్ ఖాన్ కి పొలిటికల్ గా చెక్ పెట్టడానికి  వైసీపీ పార్టీ నాయకుడు మంత్రి వెల్లంపల్లి కూడా తనదైన శైలిలో దూకుడు రాజకీయాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ విధంగా సొంత పార్టీలో మరోపక్క అనుచరులు అదేవిధంగా ప్రత్యర్ధులు వేస్తున్న రాజకీయ ఎత్తుగడలకు జలీల్ ఖాన్ పొలిటికల్ కెరియర్ దాదాపు క్లైమాక్స్ కి వచ్చినట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వినపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో మళ్లీ వైఎస్ జగన్ గూటికి చేరాలని జలీల్ ఖాన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా వార్తలు అందుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: