తెలుగుదేశం పార్టీ భవిష్యత్ పై ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు ఇంకా ఆందోళన తగ్గినట్టుగా లేకపోగా రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం టిడిపి తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటూ అనేక ఇబ్బందులు పడుతోంది. ఒకవైపు అధికార పార్టీ తెలుగుదేశం ను టార్గెట్ గా చేసుకుని ముందుకు వెళుతూ, ఆ పార్టీలో కీలక నాయకులు అందరినీ తమ వైపు తిప్పుకునే దిశగా అడుగులు వేస్తోంది. అలాగే టిడిపి ఎమ్మెల్యేలు కొంతమందితో పార్టీకి రాజీనామా చేయించి ప్రధాన ప్రతిపక్ష హోదా ను కూడా పోగొట్టాలని వైసిపి అడుగులు వేస్తోందని చంద్రబాబు ఆందోళన చెందుతున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే టిడిపి తీవ్రంగా నష్టపోయింది. పార్టీలో బలమైన నేతలను కూడా టార్గెట్ చేసుకొని ఆర్థికంగా దెబ్బతీయడమే కాకుండా, అనేక కేసులు నమోదు చేయడం ద్వారా మిగిలిన పార్టీ శ్రేణులను భయబ్రాంతులకు గురిచేస్తోందని చంద్రబాబు ఆవేదన చెందుతున్నారు.

 

IHG


 ప్రస్తుతం అధికార పార్టీపై పోరాటం చేసేందుకు పార్టీ నాయకులు ఎవరు ముందుకు వచ్చే పరిస్థితి లే.దు కేవలం కొంతమంది మాత్రమే వైసీపీని ఎదుర్కొంటున్నా, మిగిలినవారు తమకు ఎందుకు వచ్చిందిలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇటువంటి అంశాలు చంద్రబాబును బాగా ఇబ్బంది పెడుతున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర అధికార పార్టీ బీజేపీకి దగ్గరవడం ద్వారా పార్టీ భవిష్యత్తు కు తిరుగు లేకుండా చేసుకోవాలని చూస్తోంది. అలాగే జగన్ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఇబ్బందులు పెట్టే విధంగా ముందుకు వెళ్లాలని బాబు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

 

IHG


ఇప్పటికే సందర్భం ఉన్నా, లేకపోయినా అదేపనిగా కేంద్ర బిజెపి పెద్దలను పొగుడుతూ వస్తున్నారు. అలాగే సరైన సమయంలో లాక్ డౌన్ విధించడం, ఆ తర్వాత ప్రకటించిన ప్యాకేజీలపైన చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశంసించారు. అలాగే ప్రధాని కార్యాలయానికి పదేపదే లేఖలు రాస్తూ, మోదీ కి  దగ్గర అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదో రకంగా బిజెపికి దగ్గరవడం, అలాగే వచ్చే ఎన్నికల నాటికి ఆ పార్టీతో ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకోవడం ద్వారా, ఇటు జగన్ హవాను పూర్తిగా తగ్గించడమే కాకుండా, రాబోయే ఎన్నికల్లో టిడిపి జెండా రెపరెపలాడించాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. 

 


అయితే బాబు విషయంలో బీజేపీ అనుకూలంగా లేకపోవడంతో, బిజెపికి దగ్గరయ్యేందుకు ఉన్న మార్గాలు ఏమిటి ? అనే విషయాలపైన ఇప్పుడు చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. ఇప్పుడు పూర్తిగా దృష్టి మొత్తం బీజేపీకి దగ్గరయ్యే విషయాలపై చంద్రబాబు పెట్టి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే విషయాలపైనే కసరత్తు చేస్తున్నారట. కాకపోతే  బీజేపీ వైపు నుంచి ఎటువంటి రెస్పాన్స్ కనిపించకపోవడం ఇప్పుడు బాబు అండ్ కో ను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: