ఏపీ సీఎం వైఎస్ జగన్ ముందు నుండి అవినీతి విషయంలో ఎక్కడ ఎలాంటిది తన పాలనలో చోటుచేసుకోకుండా చాలా అలర్ట్ గా నిర్ణయాలు తీసుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న నాడే... పై నుంచి కింది స్థాయి వరకు ఎక్కడా కూడా అవినీతి లేకుండా చేస్తానని ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. అటువంటిది జగన్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా కు చెందిన మంత్రి  అనవసరమైన విషయాలలో ఇతర శాఖలలో కలుగ చేసుకుంటున్నట్లు వార్తలు రావడంతో పాటుగా నియోజకవర్గంలో పార్టీకి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చేయకుండా సొంత లాభం చూసుకుంటున్నట్లు జగన్ కి ఫిర్యాదులు అందినట్లు పరిశీలకుల మాట.

 

దీంతో ఇటీవల మోపిదేవి వెంకటరమణ అదేవిధంగా పిల్లి సుభాష్ చంద్ర బోస్ ఇద్దరు రాజ్యసభకు వెళుతున్న తరుణంలో వీళ్ళ మంత్రి పదవులు పోవటంతో వీరితో పాటు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సదరు మంత్రి పదవి కూడా జగన్ తీసేయాలని డిసైడ్ అయినట్లు వైసీపీ పార్టీలో టాక్. ముఖ్యంగా కరోనా వైరస్ టైంలో ఈ మంత్రి పనితనం వైయస్ జగన్ కి నచ్చకపోవడంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైసీపీ పార్టీ  లోలోపల చర్చల్లో వినపడుతున్న టాక్.

 

ఏడాది పనితనం విషయంలో మంత్రుల టాప్ టెన్ జాబితాలో కూడా సదరు మంత్రి పేరు లేనట్టు తెలియటంతో ఇప్పుడు ఈ పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ మంత్రికి టెన్షన్ పట్టుకున్నట్లు సమాచారం. ఇదే టైంలో సదరు మంత్రి పదవి పోయిన తర్వాత అదే సామాజిక వర్గానికి చెందిన వారికి జగన్ మంత్రి పదవి ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినబడుతున్నాయి. మొత్తం మీద వైయస్ జగన్ కొత్త ముఖాలతో త్వరలో తన మంత్రివర్గాన్నిఏర్పాటు చేసుకోవడానికి, పార్టీలో ఆన్ ఫిట్ నాయకులను పక్కన పెట్టడానికి రెడీ అవటంతో మిగతా మంత్రులలో కూడా టెన్షన్ నెలకొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: