చైనా దేశం అంటేనే ఇపుడు అందరికీ వణుకు బయల్దేరింది. ఆ దేశం బయోవార్ కి తెరతీసిందన్న అనుమానాలు కూడా చాలా దేశాధినేతలలో  ఉన్నాయి. చాలా సైలెంట్ గా చైనా ప్రపంచాన్ని మొత్తం అతలాకుతలం చేసిందని అనేక‌ దేశాలు ఆగ్రహంగా ఉన్నాయి. అయితే కొన్ని బయటపడుతున్నాయి. మరికొన్ని బయటపడడంలేదు.

 

అమెరికా అయితే చైనాకు తగిన గుణపాఠం చెప్పేందుకు సిధ్ధంగా ఉంది. ట్రంప్ ప్రతీ రోజూ డ్రాగాన్ తో తూటాల మాదిరిగా మాటల చెలగాటమాడుతూనే ఉన్నారు. చైనా వైరస్ అంటూ కరోనా వైరస్ కి ఆయన పేరు కూడా పెట్టారు. ఇక ఆ జాబితాలో మరికొన్ని దేశాలు ఇపుడు చేరాయి. జపాన్, యునైటెడ్ కింగ్ డం, నార్వే, జర్మనీ, అస్ట్రేలియా వంటి దేశాలు చైనా అంతు చూడాలనుకుంటున్నాయి.

 

ఇవన్నీ సంపన్న దేశాలు, అగ్ర రాజ్యాలే. ఇవి ఒక కూటమిగా ఏర్పాటు అయి చైనా కధ ముగించాలని చూస్తున్నాయి. వీటికి మరికొన్ని దేశాల మద్దతు ఉంది. అవి సరైన సమయంలో బయటకు వచ్చి చైనాకు ఎదురునిలుస్తాయని అంటున్నారు.

 

ఒక విధంగా చూస్తే చైనాకు మిత్ర దేశంగా ఒక పెద్ద దేశం కూడా లేదన్నది వాస్తవం. చైనా విషయంలో అందరికీ పీకల్లోతు కోపం ఉంది. నిజానికి తాజాగా  భారత్ మీద దండెత్తుదామని చైనా ఎత్తు వేసింది కానీ ప్రపంచమంతా ఇలా శత్రువుగా మారడంతో వెనక్కి అడుగులు వేసింది. డ్రాగాన్ ఇలా భారత్ ముందు తోక ముడవడం ఇదే తొలిసారి.

 

ఇకపోతే భారత్ కూడా సరైన సమయం కోసం ఎదురుచూస్తోంది. చైనాకు వ్యతిరేకంగా గొంతు విప్పాలనుకుంటోంది. చైనా పక్కలో  బల్లెంగా మారుతూ దశాబ్దాలుగా చేస్తున్న అన్యాయానికి ఒక్క దెబ్బకు గుణపాఠం చెప్పాలనుకుంటోంది.

 

అంతా కలసి వేస్తున్న ఎత్తులకు చైనా చిత్తు కాక తప్పదని అంటున్నారు. ఓ విధంగా చైనాను అష్టదిగ్బంధనం చేస్తున్నారు. మళ్ళీ డ్రాగాన్ పిచ్చి పనులు చేయకుండా గట్టి గుణపాఠమే చెప్పాలనుకుంటున్నారు. చూడాలి మరి చైనా కు గట్టి షాక్ ఎపుడు తగులుతుందో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: