ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి నుండి ప్రజలు ఎప్పుడు విముక్తి పొందుతారో ఎవరికీ తెలియడం లేదు. ఇక వైరస్ మొట్టమొదటిసారి చైనాలోని వుహాన్ నగరంలో వ్యాప్తి చెందిన విషయం తెలిసిందే. అక్కడినుండే ఇది ప్రపంచ దేశాలకు పాకింది. ఎంతో అనూహ్యంగా చైనా కొద్ది నెలల్లోనే వైరస్ బారినుండి తప్పించుకోగా ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ చైనా తీరును విపరీతంగా అనుమానిస్తున్నాయి. వారు కుట్రపూరితంగానే కావాలని వైరస్ ను ప్రపంచం మీదకి వదిలారని వందలాది ఆరోపణలు వస్తున్నాయి.

 

ఇక వివరాల్లోకి వెళితే గత సంవత్సరం అనగా 2019లో వేసవి ముగిసిన తర్వాత చైనాలో కరోనా వైరస్ ప్రభావం మొదలైంది అని సాటిలైట్ ఇమేజెస్ ద్వారా స్పష్టంగా కనిపించిందట. హాస్పిటళ్ళ బయట పార్క్ చేసి ఉంచిన వందలాది వాహనాలు కానివ్వచ్చు.... ఇంకా గూగుల్ వంటి చైనా లోని 'బైడు' అనే సెర్చ్ ఇంజన్ లో చైనీయులు ఎక్కువగా సెర్చ్ చేసిన పదాలలో 'జలుబు', 'దగ్గు' విరేచనాలు వంటి పదాలు చాలా ఎక్కువగా ఉండడం మరియు వాటికి కారణాలు ఏమిటని వారు తీవ్రంగా శోధించారు.

 

దీనిని బట్టి పరిశోధకులు చెబుతుంది ఏమిటంటే పోయిన సంవత్సరం ఆగస్టు నెలలోనే చైనాలో కరోనా వైరస్ ఉనికి మొదలైందట. కానీ వ్యాధి ఆరోగ్యవంతులలో దానంతట అదే తగ్గిపోతుంది కనుక అది బయటపడలేదా…. లేక కావాలనే విషయాన్ని దాచిపెట్టారా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ఇక డిసెంబర్ లో చాలా కచ్చితంగా ఇది చాలా అరుదైన వైరస్ మరియు ప్రమాదకరమైనదని గుర్తించిన చైనీస్ డాక్టర్ ను అక్కడి అధికారులు మరియు పోలీసులు ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నాడని అరెస్టు చేసిన తీరు…. ఇక చివరికి అతనితో పాటు ప్రస్తుతం ప్రపంచంలో లక్షలాదిమంది చావుకు కూడా కారణం కావడం తో ఇదంతా చైనీయుల కుట్ర దాగి ఉందని ప్రజలు అనుకుంటున్నారు.

 

ఇక హాస్పిటళ్ళలో అంతకు ముందు తో పోలిస్తే గత సంవత్సరం ఆగస్టు నెలలోనే 90% ఎక్కువగా పార్కింగ్ ఏరియా లో కార్లు ఉండడం మరియు హాస్పిటల్ ఏరియా ల్లో ట్రాఫిక్ పెరగడం శాటిలైట్ లు గమనించాయి. ఎన్ని మార్గాలుగా చైనీయులు కరోనా నింద నుండి తప్పించుకుందామనుకున్నా వారికి చివరికి ఎలాంటి వీలు చిక్కకుండా పోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: