ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి ఈనెల 19 తేదీన రాజ్యసభ ఎన్నికలు జరగనుండగా టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న వర్ల రామయ్య కారణంగా ఓటింగ్ జరగవలసి ఉంది ఇకపోతే ఎన్నికల్లో వైసీపీ నాలుగు స్థానాలను కైవసం చేసుకుని ఉండగా ఇందులో ఇద్దరూ రాజ్యసభకు ఎన్నిక కానున్నారు అంటే నెల 19 తేదీ లోపల వారు వారి మంత్రి పదవులకు రాజీనామా చేయవలసి ఉంటుంది.

 

దీంతో వైసిపి నాయకులు అయిన పిల్లి సుభాష్ చంద్రబోస్ మోపిదేవి రమణ 19 తేదీకి ముందుగానే రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది ఇద్దరు కూడా అందుకు మానసికంగా సిద్ధమయ్యారు అనే చెప్పాలి ఇప్పటికే శాసనమండలిని రద్దు చేస్తూ జగన్ తీసుకున్న నిర్ణయం అత్యంత కీలకమైనది కావున కావడంతో ఎంతో నమ్మకస్తులైన వీరిద్దరినీ జగన్ రాజ్యసభకు ఎంపిక చేశారు.

 

ఇంతవరకూ ఓకే. కానీ తర్వాతే జగన్ కు ఇబ్బంది కరంగా మారనుంది. ఇద్దరి స్థానంలో మరో ఇద్దరిని కొత్తగా మంత్రివర్గంలోకి జగన్ చేర్చుకోవాల్సి ఉంటుంది. ఇద్దరు ఎవరన్న దానిపైనే ఇప్పుడు పార్టీలో చర్చ జరుగుతోంది. పదిరోజులే సమయం ఉండటంతో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఆసక్తి నెలకొంది.

 

ఇప్పటికే డజన్ మంది ఎమ్మెల్యేలు రెండు మంత్రి పస్దవుల కోసం ముందు వరుసలో కాచుకొని కూర్చొని ఉన్నారు. అయితే ఇప్పటికే జగన్ దీనికి సంబంధించిన కసరత్తులు పూర్తి చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే సామాజికవర్గానికి చెందిన వారికి ఇచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు. మరి దీని వల్ల తీవ్రంగా నిరుత్సాహ పడే ఆశావాహుల పర్తిస్థితి ఏమిటి అనేది ఇంకా తేలడం లేదు. మరీ తూర్పు గోదావరి, గుంటూరు జిల్లా నాయకులకే మరలా పదవులు కట్టబెట్టడం కాకుండా…. ఇతర జిల్లాలకు చెందిన అదే సామాజిక వర్గానికి చెందిన నేతలందరినీ పరిగణలోకి తీసుకుంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: