దేశం అంతా ఇప్పుడు కరోనాతో కష్టకాలంలో నడుస్తుంది.  మొన్నటి వరకు చేయడానికి పనులు లేక.. ఉన్నా బయటకు వెళ్లే ఛాన్స్ లేక ఇంటి పట్టున ఉంటూ ఉన్నది తింటూ నానా అవస్థ పడ్డారు సామాన్య జనం.  అయితే ఈ సమయంలోనే సాటి మనిషికి కాస్త సాయం చేయాలన్న ఆలోచన రావడం.. ఎన్నో స్వచ్చంద సంస్థలు, సినీ, రాజకీయ, క్రీడా రంగానికి చెందిన వారు ముఖ్యంగా రతన్ టాటా లాంటి పెద్ద మనసు ఉన్న వ్యాపార స్థంస్థలు ముందుకు వచ్చి విరాళాలు ఇచ్చారు.  ఇక పేద ప్రజలకు ప్రభుత్వాలు సాయమందిస్తున్నాయని చెబుతూనే ఉన్నారు.  ఈ మద్య లాక్ డౌన్ వెసుల బాటు చేయడం.. ఎవరి స్వస్థలాలకు వారు వెళ్లేందుకు పరిమిషన్ ఇవ్వడంతో ఇతర రాష్ట్రాల్లో ఉన్న పేద ప్రజలు, వలస కూలీలు తమ సొంత గూటికి వెళ్తున్నారు.  ఈ క్రమంలో చాలా మంది జబ్బున పడుతున్న విషయం తెలిసిందే. 

 

తమ ఊరికి వెళ్లినా.. అక్కడ ఏ చిన్న ఇబ్బంది కలిగినా డాక్టర్ల వద్దకు వెళ్తే బిల్లులు మోత మోగిస్తున్నారు. కరోనా సంక్షోభంలోనూ కొన్ని ఆసుపత్రులు కక్కుర్తి బుద్ధి పోనిచ్చుకున్నాయి కాదు. ప్రభుత్వాలు కరోనా రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తుంటే.. రెండు ప్రైవేట్ ఆసుపత్రులు మాత్రం ఎప్పటిలానే కరోనా పేషెంట్ల నుంచి డబ్బులు వసూలు చేశాయి. దాంతో ఆ ఆసుపత్రులపై  భారీగా జరిమానా విధించింది ప్రభుత్వం. ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.  కరోనా కేసులు ఎక్కువగా ఇక్కడే పెరిగిపోతున్నాయి.

 

ఈ క్రమంలో కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు కరోనా చికిత్స నిబంధనలు పాటించడం లేదు. కరోనాను క్యాష్ చేసుకుందామని భావించాయి. అసలే మొన్నటి వరకు నానా ఇబ్బందులు పడి ఈ మద్యే పనులకు వెళ్తున్నారు.. ఇలాంటి సమయంలో ప్రభుత్వాలు చెబుతున్నా ప్రైవేట్ యాజమాన్యం ఇలాగే చేస్తుంది.  అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రూ.5 లక్షల జరిమానా విధించింది. 7 రోజుల్లోపు మొత్తాన్ని జమ చేయడంలో విఫలమైతే ఆసుపత్రులు తమ రిజిస్ట్రేషన్‌ను కోల్పోతాయని ప్రభుత్వం హెచ్చరించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: