తమిళనాడులో కరోనా భయంకరంగా విజృంభిస్తోంది. అక్కడ రోజూ వేల సంఖ్యలో కొత్త కరోనా కేసులు పుట్టుకొస్తున్నాయి. ఒక్క చెన్నై నగరంలోనే వెయ్యికిపైగా కరోనా కేసులు వస్తున్నాయి. అక్కడ పరిస్థితి ఎంత భయంకరంగా ఉందంటే.. చివరకు కరోనా సహాయ చర్యల్లో చురుగ్గా పాల్గొన్న ఎమ్మెల్యే కూడా కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయాడు.

 

 

డీఎంకే కు చెందిన అన్బళగన్ అనే ఈ ఎమ్మెల్యే చెన్నైలోని చెప్పాకం నియోజకవర్గం నుంచి ఆయన మూడో సారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన వయసు అరవై రెండేళ్లు. ఆయన గత కొద్ది రోజులుగా కరోనా వైరస్ సమస్యతో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నారు. ఆయన బుధవారం ఉదయం మరణించారు. దేశంలో కరోనా వల్ల మరణించిన తొలి ఎమ్మెల్యే అన్బళగనే. ఈయన సినీ నిర్మాత, పంపిణీదారు కూడా.

 

 

డీఎంకే శాసనసభ్యుడు అన్బళగన్ 2001 , 2011 , 2016 మూడుసార్లు శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు . ప్రస్తుతం చెన్నై చెప్పాక్కం శాసన సభ్యునిగా కొనసాగుతున్నారు . ఆయన దివంగత కరుణానిధి , డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ కు బాగా సన్నిహితుడు . తమిళంలో నటుడు జయం రవితో అన్బళగన్ ఆది భగవాన్ అనే చిత్రాన్ని నిర్మించారు. విషాదం ఏంటంటే.. నేడు ఆయన పుట్టినరోజు. పుట్టినరోజే మరణించడం బాధాకరం .

 

 

ఇక తమిళనాడులో కరోనా అదుపులోకి వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. కరోనా కట్టడి కోసం అక్కడి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అంతగా ఫలించడం లేదు. చివరకు రాజకీయ నాయకులు కూడా ప్రాణాలు కోల్పోతున్న దుస్థితి నెలకొంది. నేడు మరణించిన అన్బళగన్ ఎక్కువగా కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన వందలాది మందికి ఆహారం అందించారట. ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్లే కరోనా బారిన పడ్డారని తెలుస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: