వైయస్ జగన్ సర్కార్ ని ఇబ్బంది పెట్టిన విషయాలలో ఒకటి మత్తు డాక్టర్ సుధాకర్ వ్యవహారం. కరోనా వైరస్ వచ్చిన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం వైద్యులకు సరైన మాస్క్ లు కల్పించడం లేదని సుధాకర్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో ఎంత హైలెట్ అయ్యాయో అందరికీ తెలుసు. దీంతో ఒక్కసారిగా ప్రభుత్వంపై ఆ టైంలో బురద పడే అవకాశం ఉండటంతో డాక్టర్ సుధాకర్ చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం ఉందో లేదో ప్రభుత్వం విచారణ వేసి ఆయన చేసిన వ్యాఖ్యల లో  వాస్తవం లేదని ఆయనను సస్పెండ్ చేశారు. దీంతో జగన్ చేసిన ఈ పనికి అటు జాతీయ పరంగా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమయింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరియు ఇతర నిపుణులు ప్రభుత్వం డాక్టర్ సుధాకర్ పై వ్యవహరించిన తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఒక వైద్యుడిని ప్రజల ప్రాణాలను కాపాడే వాడిని ఈ విధంగా రాజకీయ కక్ష సాధింపు చర్యలతో పైగా దళిత డాక్టర్ అని కనికరించ కుండా దారుణమని ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి.

 

ఆ తర్వాత ఈ విషయం న్యాయస్థానాల దాకా వెళ్ళటం తరువాత సీబీఐ దృష్టికి వెళ్లడంతో ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఇదే తరుణంలో మరో వైద్యురాలు డాక్టర్ అనిత రాణి వ్యవహారం ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఆమె ఇటీవల మీడియా ముందుకు వచ్చి తనని వైసీపీ నేతలు వేధింపులకు గురి చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ విషయంలో వెంటనే జగన్ స్పందించి అనిత రాణి వ్యవహారాన్ని సిఐడికి అప్పగిస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో మంత్రులు మరియు ప్రజాప్రతినిధులు ఎవరూ జోక్యం చేసుకోకూడదని సీఎం జగన్ గట్టిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ తనపై వైసీపీ నేతలు చేసిన వేధింపులు విషయంలో హైకోర్టు న్యాయస్థానాన్ని ఆశ్రయించి సుధాకర్ కేసు తరహాలోనే నా కేసును కూడా సీబీఐ చేత విచారించాలని అనిత రాణి  డిమాండ్ చేశారు.

 

అయితే ఈ విషయంలో వైఎస్ జగన్ ముందుగా సిఐడికి అప్పగించి రాష్ట్ర ప్రభుత్వంపై బురద పడకుండా అత్యుత్సాహంగా వెళ్లారా అన్న అనుమానం ప్రతి ఒక్కరిలో నెలకొంది. అంతేకాకుండా తన పార్టీ వైపు తప్పు ఉండటంతోనే ఈ వ్యవహారం సీబీఐ దృష్టి దాక వెళ్లకుండా జగన్ జాగ్రత్త పడినట్లు దళితులు అనుకుంటున్నారట. ముఖ్యంగా వైఎస్ జగన్ ఓటు బ్యాంకు ఎక్కువగా దళితులు కావటంతో పైగా అనిత రాణి సుధాకర్ ఇద్దరూ దళితులు కావటంతో ఈ విషయంలో వైయస్ జగన్ తప్పు చేస్తున్నాడా అనే అనుమానం పార్టీలో ఉన్నవారికి కూడా నెలకొన్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: