వైయస్ జగన్ అధికారంలోకి వచ్చి ఏడాది అయిన సందర్భంలో ఇటీవల వైసీపీ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ప్రభుత్వం పై చేసిన విమర్శలు అందరికీ షాక్ కి గురి చేసిన విషయం అందరికీ తెలిసిందే. సొంత పార్టీ నేతలే విమర్శలు చేయడంతో వైసీపీ పార్టీలో ఉన్న పెద్దలు కూడా అంతర్మధనం లో పడినట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఇసుక విషయం అదేవిధంగా వైయస్ జగన్ తో భేటీ అయ్యే అవకాశం కూడా లేకపోవటం వంటి విషయాలలో తీవ్రస్థాయిలో ప్రభుత్వంపై విమర్శలు చేయడం జరిగింది. ఇటువంటి తరుణంలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకి తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న ఓ సీనియర్ నాయకుడు పార్టీకి చెందిన నేత ఫోన్ చేసినట్లు ఒక వార్త రాష్ట్రం లో వైరల్ అవుతోంది.

 

వైసీపీలో ఉన్న అసమ్మతి నేతలకు పార్టీలో వచ్చే అవకాశం కల్పించాలని, వారిని పార్టీలోకి తీసుకు వచ్చి ప్రభుత్వాన్ని దెబ్బతీయాలని బాబుతో ఈ నేత అన్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా అసమ్మతి నేతలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లి ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ను చూపించాలని బాబుకి ఈ నేత తెలియజేశారు అట. దానికి చంద్రబాబు కూడా సానుకూలంగా ఉన్నట్లు… కానీ ఇప్పుడు కాదని రాబోయే రోజుల్లో ఈ ప్లాన్ అమలు చేద్దామని అన్నట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వినబడుతున్నాయి.

 

ప్రభుత్వాన్ని స్థాపించి మెజారిటీ లేకపోయినా గాని జగన్ ప్రభుత్వం మెజార్టీ తగ్గించవచ్చని ఆ నేత చంద్రబాబు కి అనటంతో చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అంతేకాకుండా గత ఎన్నికల టైంలో మీ పై వ్యతిరేకత ప్రజలకు లేదని కేవలం ప్రజాప్రతినిధులపై వ్యతిరేకత వల్లే టీడీపీ పార్టీ ఓడిపోయినట్లు చంద్రబాబుతో ఆ నేత అన్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తంమీద వై.ఎస్ జగన్ పార్టీలో అసమ్మతి నాయకులను తమ పార్టీలోకి లాక్కొని వైసీపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి టీడీపీ పార్టీ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: