దేశ రాజధానికి కరోనా గండం పొంచి ఉందా..? ఢిల్లీ మరో వాషింగ్టన్‌ కాబోతుందా...? అంటే అవననే సమాధానం వస్తోంది. రోజు రోజుకు పెరుగుతున్న కేసులు... ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పేషెంట్లకు చికిత్స అందించేందుకు బెడ్లు కూడా సరిపోని పరిస్థితికి చేరింది.

 

ఢిల్లీలో కరోనా ఎలా వస్తుందో... ఎటు నుంచి వస్తోందో అస్సలు అంతుచిక్కడం లేదు. ఎలాంటి కాంటాక్టులు లేకున్నా...కరోనా సోకుంతుంది. కొందరిలో ఐతే ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకునే వరకూ కరోనా వచ్చినట్లు కూడా తెలియడం లేదు. దీంతో సమాజిక వ్యాప్తి దశలోకి వెళ్లిందా... అన్న అనుమానం కలుగుతోంది. మంగళవారం 3,700 మందికి కరోనా పరీక్షలు చేయగా... వెయ్యి ఏడుగురికి పాజిటివ్‌ వచ్చింది. 27శాతం మందికి కరోనా సోకింది.

 

ఢిల్లీలో కరోనా పరిస్థితిపై లెప్టెనెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ సమీక్ష చేశారు. మనీష్ సిసోడియా, ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ హాజరైయ్యారు. జూన్ 31 నాటికి ఐదున్నర లక్షల కరోనా కేసులు బయటపడతాయన్నారు మనీష్ సిసోడియా. సామాజిక వ్యాప్తి జరుగుతుందని.. కరోనా ఎవరి నుంచి ఎవరికి సోకుతుందో అర్థం కావటం లేదని అన్నారు ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌. 

 

ఢిల్లీలో ఇప్పటి వరకూ 37వేలకు పైగా కేసులు ఉన్నాయి. డబ్లింగ్ రేటును బట్టి జూలై 31 వరకు ఐదున్నర లక్షల కేసులు నమోదవుతాయని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పుడే బెడ్ల కొరత వెంటాడుతోంది.  కేసులు ఇలానే పెరిగితే 80వేల బెడ్లు అవసరమని ఢిల్లీ సర్కార్‌ చెబుతోంది. కరోనా వైరస్ కి గురైన రోగిని చేర్చుకునేందుకు కాదు కదా కనీసం కరోనా టెస్టు చేయడానికైనా ఆస్పత్రులు నిరాకరించాయి. దీంతో 42 ఏళ్ళ రోగి..భోపాల్ కి చికిత్స కోసం వెళ్ళాడు. ఆస్పత్రిలో అడ్మిట్‌ అయ్యేలోపే అతడు చనిపోయాడు. కరోనా రోగులను తిప్పి పంపివేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కేజ్రీవాల్ హెచ్ఛరించినప్పటికీ... కొన్ని ఆస్పత్రులు చికిత్స అందించేందుకు నిరాకరిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: