విజయ్ మాల్యా.. ఇతను విలాస పురుషుడు... మద్యానికి బ్రాండ్ అంబాసిడర్ .. ఒకప్పటి సక్సెస్ఫుల్  బుసినెస్స్మన్ ..  బ్యాంకులకు అప్పు ఎగ్గొట్టి తప్పించుకుని తిరుగుతున్న దొంగ ఇలా చెప్పుకుంటూ పోతే విజయ్మాల్యా గురించి ఎన్నో రకాలుగా చెప్పవచ్చు. ఒకప్పుడు ఎంతో విలాసవంతమైన జీవితాన్ని గడిపి.. విలాసాల కోసమో కోట్లకు కోట్లు ఖర్చుపెట్టి... ఆ తర్వాత తన విమానయాన సంస్థ నష్టాల్లో కూరుకుపోవడం.. బ్యాంకుల నుంచి తీసుకున్న వేల కోట్ల అప్పులు ఇతర కంపెనీలకు తరలించడంతో దివాళా  తీసి బ్యాంకులకు అప్పులు  కట్టలేక ప్రస్తుతం సిబిఐ నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు విజయ్ మాల్యా. అప్పట్లో వ్యవస్థల్ని మ్యానేజ్ చేసినటువంటి ఒక మోనార్క్ విజయ్ మాల్యా. 

 


 ఇక వ్యవస్థల మేనేజ్మెంట్ ద్వారానే ఏకంగా మోస్ట్ వాంటెడ్ అయినప్పటికీ కూడా విమానాల ద్వారా విదేశాలకు పారిపోగలిగాడు విజయ్ మాల్యా. ప్రస్తుతం విజయమాల్య మీద నడుస్తున్న కేసు ఏమిటి అంటే బ్యాంకుల నుంచి వందల కోట్ల అప్పులు తీసుకుని ఒక సంస్థపై పెట్టుబడి పెట్టకుండా వేరే రూట్లో మరొక అకౌంట్ కి తరలించారు అన్నది ప్రస్తుతం విజయ్ మాల్యా మీద ఆరోపణలు. విజయ్ మాల్యా దేశాన్ని వదిలి పారిపోయిన తర్వాత జరిగిన విషయాలన్నీ అందరికి తెలిసినవే. అక్కడ న్యాయస్థానాలలో అడ్డుపెట్టుకొని ఎన్ని రోజుల వరకు తప్పించుకు తిరుగుతున్నాడు విజయమాల్య. 

 


 ఇక ఆ తర్వాత ఈడీ ముమ్మర దర్యాప్తు చేపట్టింది అక్కడ విదేశీ కోర్టు కూడా విజయం మాల్యా  ఇండియాకు రప్పించాలని నిర్ణయించిందని ఈ నేపథ్యంలో రేపోమాపో విజయ్ మాల్యా భారతదేశానికి వస్తాడు అని వార్తలు మొన్నటికి మొన్న హల్ చల్ చేసాయి . కానీ విజయ్ మాల్యా భారత్ రాక మాత్రం అకస్మాత్తుగా ఆగిపోతుంది. అయితే విజయ్ మాల్యా ఇండియా కు రావడం ఎందుకు ఆగిపోయింది అన్న దానికి మాత్రం తాజాగా అసలు నిజం బయటపడింది. యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆర్టికల్  కింద. భారత జైలులో రాజకీయంగానే కాకుండా మరెన్నో విధాలుగా తనకు ప్రాణహాని ఉందని అందుకే తనకు క్షమాభిక్ష పెట్టి అక్కడే ఉండేందుకు అనుమతించాలని పిటిషన్ దాఖలు చేయగా దీనిపై విచారణ జరిగింది అందుకే విజయ్ మాల్యా ఇండియా కు రావడం ఆగిపోయింది అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: