ఇటీవల సినిమా ఇండస్ట్రీ అభివృద్ధికి సంబంధించి అలాగే షూటింగ్ అనుమతుల విషయం గురించి చిరంజీవి ఆధ్వర్యంలో సినీ ప్రముఖులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ని కలవటం అందరికీ తెలిసిందే. మంగళవారం మధ్యాహ్నం వైయస్ జగన్ ఇల్లు తాడేపల్లి లో చిరంజీవి ఆధ్వర్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు నాగార్జున, రాజమౌళి, దిల్ రాజు, సి. కళ్యాణ్ మరికొంత మంది భేటీ అయ్యారు. దాదాపు 20 నిమిషాలకు పైగా ఈ సమావేశం జరిగింది. సినిమా ఇండస్ట్రీ గురించి అదే విధంగా ఇండస్ట్రీ అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం ఏ విధంగా సహాయ పడాలనే అనేక విషయాల గురించి, ఈ సమావేశంలో చర్చించినట్లు సమావేశం అనంతరం చిరంజీవి మీడియాతో తెలపడం జరిగింది.

IHG

అయితే సినిమా ఇండస్ట్రీకి చెందిన పెద్దలకి సీఎం జగన్ తో భేటీ అయిన సమయంలో అమరావతి సెగ తగిలింది. అమరావతిలో దీక్షలు చేస్తున్న మహిళా రైతులు కొంతమంది అమరావతికి సినిమా ఇండస్ట్రీ పెద్దలు మద్దతు ఇవ్వాలని అప్పుడు మీరు నిజమైన హీరోలు అవుతారని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.

IHG

మేము రాజధాని కోసం పొలాలు త్యాగం చేశాము ఖచ్చితంగా అమరావతి కి సపోర్ట్ చేయాలని ఇప్పటివరకు ఇండస్ట్రీ నుండి ఎవరు సపోర్ట్ చేయలేదు అంటూ అమరావతి రైతులు చేసిన వ్యాఖ్యలు కొన్ని మీడియాలో సంచలనం సృష్టించాయి. అయితే ఈ వార్త వైయస్ జగన్ దాక రావడంతో వెంటనే జగన్ తన తో భేటీ అయిన ఇండస్ట్రీకి చెందిన వాళ్ళతో ఫోన్ చేసి, అసలు రియాక్ట్ అవ్వద్దు అని కోరినట్లు టాక్ నడుస్తోంది. సినిమా ఇండస్ట్రీకి రాజకీయాలకు సంబంధం లేదు అన్నట్టుగా వైయస్ జగన్ వారితో మాట్లాడినట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: