ఏపీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. 24 గంటల్లో 218 కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 5 వేల 247కి చేరింది. ఇప్పటివరకు కరోనాతో 78 మంది మృతి చెందారు. 

 

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మరింతగా విస్తరిస్తోంది. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయే తప్ప తగ్గే పరిస్థితులు మాత్రం కనిపించట్లేదు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. కేసుల ఉధృతి మాత్రం తగ్గట్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో 218 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. 

 

రాష్ట్రానికి చెందిన 136 మంది.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 26 మందికి, విదేశాల నుంచి ఏపీకి వచ్చిన 56 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 5 వేల 247కి చేరినట్లుగా హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. ఏపీలోని పలు ఆస్పత్రుల్లో ప్రస్తుతం 1573 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ కరోనాను జయించి 2 వేల 475 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. తూర్పుగోదావరి జిల్లాలో ఒకరు మృతి చెందగా.. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 78కి చేరింది.

 

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ పరీక్షల సామర్థ్యం రోజురోజుకి పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 15 వేల 384 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. 72 మంది కరోనా నుంచి కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. కోవిడ్‌ వల్ల మంగళవారం తూర్పుగోదావరిలో ఒక్కరు మరణించారు. ఈ మేరకు వైద్యఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. దీని ప్రకారం ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 4 వేల 126కు చేరింది. 78 మంది మృత్యువాత పడ్డారు.

 

మొత్తం 2 వేల 475 మంది డిశ్చార్జి కాగా, ప్రస్తుతం వెయ్యి 573 మంది కరోనా బాధితులు వివిధ ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: