అమెరికా పోలీసుల దాష్టీకానికి బలైన నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ అంత్యక్రియలు ముగిశాయి. సొంత నగరం హ్యూస్టన్ లో తల్లి సమాధి పక్కనే ఫ్లాయిడ్ భౌతికకాయాన్ని ఖననం చేశారు. ఫ్లాయిడ్ అంత్యక్రియలకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. మరోవైపు ఫ్లాయిడ్ కేసులో ప్రధాన నిందితుడికి బెయిల్ లభించింది. 

 

అమెరికాలో శ్వేత జాతి పోలీసుల చేతిలో దారుణ హత్యకు గురైన ఆఫ్రో - అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ అంత్యక్రియలు ముగిశాయి. అతని స్వస్థలమైన హ్యూస్టన్ లో మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు. తల్లి సమాధి పక్కనే ఆయన భౌతికకాయాన్ని ఖననం చేశారు.

 

ఫ్లాయిడ్ కు నివాళులర్పించేందుకు వేలాది మంది తరలివచ్చారు. వీరిలో నటులు కూడా ఉన్నారు. రాపర్ ట్రే థా ట్రూత్, రిపబ్లిక్ షీలా జాక్సన్ లీ, జామీ ఫాక్స్, చాన్నింగ్ టాటమ్, హూస్టన్ పోలీస్ చీఫ్ ఆరక్ట్ అసేవెడో, హ్యూస్టన్ మేయర్ సిల్వెస్టర్ టర్నర్ ఇతరులున్నారు. వీరంతా 
ఫోర్జరీ పత్రాలు వినియోగిస్తున్నాడనే అనుమానంతో మినియా పోలీస్‌ అధికారులు ఫ్లాయిడ్ ను కారులోంచి బయటకు లాగి రోడ్డుపై పడేసి మెడపై మోకాలితో తొక్కిపట్టారు. ప్రతిఘటించకపోయినా నల్లజాతీయుడనే కారణంతో దారుణంగా వ్యవహరించారు. ఐకాంట్ బ్రీత్ అని వేడుకున్నా పట్టించుకోలేదు. చనిపోయే ముందు ఫ్లాయిడ్ నోటి నుంచి వచ్చిన చివరి పదం కూడా ఐ కాంట్ బ్రీత్‌. ఈ ఘటనే అమెరికాలో ఆగ్రహావేశాల వ్యక్తమయ్యేలా చేశాయి. ఈ వివాదానికి ట్రంప్‌ తన ట్వీట్‌తో ఆజ్యం పోశారు. నిరసనకారుల్ని దుండగులుగా అభివర్ణించడంతో మరింత రగిలిపోయారు. దాని ఫలితంగా నిరసనల సెగ వైట్ హౌస్ ను తాకడంతో.. ట్రంప్ బంకర్లో తలదాచుకోవాల్సి వచ్చింది. 

 

జార్జి ఫ్లాయిడ్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడు డెరిక్ కెవిన్ కు బెయిల్ వచ్చింది. 12.5 లక్షల డాలర్ల పూచీకత్తుతో బెయిల్ ఇస్తూ జడ్జి ఉత్తర్వులిచ్చారు. ప్రజాగ్రహం కారణంగానే పూచీకత్తు మిలియన్ కు పెంచినట్టు ప్రాసిక్యూటర్ చెప్పారు. సెకండ్ డిగ్రీ ఆరోపణలపై డెరిక్ కెవిన్ ను విచారిస్తున్నారు. ఈ హత్యలో అతనికి సహకరించారన్న ఆరోపణలపై మరో ముగ్గురు అధికారులు కూడా విచారణ ఎదుర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: