ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు తెరాస ప్రభుత్వ పెద్దలను కలిసిన తరుణంలో, దానికి సంబంధించిన వార్త తనకి చెప్పకపోవడంతో బాలయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అందరికీ తెలిసిందే. బాలయ్య చేసిన వ్యాఖ్యలు అటు రాజకీయ రంగం లోను ఇటూ  సినిమా రంగంలోనూ పెను దుమారాన్ని రేపుతున్నాయి. ముఖ్యంగా చాలా మృదుస్వభావి పైగా విమర్శలకు పెద్దగా అవకాశం కూడా ఇవ్వకుండా వ్యక్తిత్వం కలిగిన చిరంజీవి ని విమర్శించడంతో బాలయ్య బాబు ఇండైరెక్టుగా వైసీపీకి మేలు చేస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. బాలయ్య 60వ జన్మదినానికి సంబంధించి పలు వెబ్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది.

 

ఈ సందర్భంగా తనని కావాలని ఇగ్నోర్ చేస్తే నేను కూడా ఇగ్నోర్ చేయాల్సి వస్తోందని… “80స్ తారల రీ యూనియన్ ప్రతీ ఏడాది జరుగుతుంది. ఈసారి హైదరాబాద్‌లోనే పార్టీ జరిగింది. దానికి నన్ను పిలవలేదు. ఎందుకని నన్ను అవాయిడ్ చేసారు? అయినా ఐ డోంట్ కేర్. నాదంతా గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ పాలసీ. చేస్తే పూర్తిగా అవాయిడ్ చేసేయండి. అప్పుడు నా దారిలో నేను వెళ్తా.. అంతే” అంటూ బాలయ్య  కామెంట్స్ చేశారు.  చిరంజీవి ఇంట్లో జరిగిన ఈ వేడుకలకు తనను పిలవలేదని చాలా దురుసుగా మాట్లాడటం జరిగింది. ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో అయ్యుండి పైగా ఒక పార్టీకి ఎమ్మెల్యే అయ్యుండి బాలకృష్ణ ఈ విధంగా వ్యాఖ్యలు చేయటం ఆయన ఇమేజే చాలా డ్యామేజ్ అవుతోందని అంటున్నారు. 

 

బాలకృష్ణ మాదిరిగా చిరంజీవి ఇండస్ట్రీలో వారసత్వంగా రాలేదు కష్టపడి వచ్చాడు ఆయన నీ ప్రేమించే అభిమానించే వారు ఇప్పటి ఎందరో ఉన్నారు. ఇలాంటి సమయంలో బాలయ్య కామెంట్స్ ఎమ్మెల్యేగా టీడీపీ కి భారీ డ్యామేజ్ చేసే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు. ముఖ్యంగా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఫేవర్ గా చూపించిన అది మరింతగా చిరంజీవికి పాజిటివ్ కాకపోయినా గానీ వైయస్ జగన్మోహన్ రెడ్డి కి చాలా బెనిఫిట్ చేస్తోందని, ఇప్పటికే చిరంజీవి తమ్ముడు నాగబాబు వైయస్ జగన్ కి సపోర్ట్ చేస్తూ ఆ మీడియా ఛానల్స్ ని విమర్శించడం జరిగింది. ఈ విధంగానే కొనసాగితే… ఈ మొత్తం వాతావరణం గొడవంతా వైయస్ జగన్ కి ఫేవర్ అవుతోందని చాలామంది విశ్లేషిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: