కర్ణాటకలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి చాపకింద నీరులాగా విజృంభిస్తుంది. తాజాగా కర్ణాటక ఆరోగ్య శాఖ కోవిడ్-19 హెల్త్ బులిటెన్ ను విడుదల చేయడం జరిగింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 120 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  దీనితో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6041 కి చేరుకుంది. అలాగే గడచిన 24 గంటల్లో కరోనా వైరస్ బారిన పడి ముగ్గురు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు 69 మంది మృత్యువాత పడ్డారు.

 

 

ఇకపోతే గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 257 మంది కరోనా వైరస్ నుంచి కోలుకొని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నారు. దీనితో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 2862 మంది డిశార్జి అవ్వడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3180 కేసులు యాక్టివ్ గా కొనసాగుతున్నాయి. 

 


నేటితో నమోదైన కేసులు కలుపుకొని రాష్ట్రవ్యాప్తంగా 6041 కేసులు నమోదు చేయడం జరిగింది. ఇందులో 14 మందికి కాస్త సీరియస్ గా ఉండడంతో వారిని ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఇకపోతే నేడు కొత్తగా విదేశాల నుంచి వచ్చిన వారిలో ముగ్గురికి కరోనా పాజిటివ్ గా తేలింది. అంతే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 68 మంది కూడా కరోనా పాజిటివ్ గా తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: