హిందువులు ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఎన్నో ఏళ్లుగా వివాదాస్ప‌ద అంశంగా కొన‌సాగిన రాముని జ‌న్మ‌భూమి అయోధ్య‌లో ఎట్ట‌కేల‌కు బుధ‌వారం ఆల‌య నిర్మాణానికి భూమి పూజ జ‌రిగింది.   రామ జన్మభూమి ప్రాంతంలో ఉన్న కుబేర్ తిలలో ఈ భూమి పూజ కార్యక్రమాన్ని వేద పండితులు, బ్రాహ్మోణోత్త‌ములు  నిరాడంబరంగా నిర్వహించారు. లాక్ డౌన్ నుంచి కాస్త వెసులుబాటు రావడంతో నేడు ఈ కార్యక్రమం నిర్వహించారు. మొదట పరమ శివుడికి రుద్రాభిషేకం నిర్వహించి.. అనంతరం పునాది రాయిని నెలకొల్పారు. మహంత్ కమల్ నయన్ దాస్ ఇతర సాధువులతో రుద్రాభిషేక క్రతువును ఉదయం 8:00 గంటలకు ప్రారంభించారు. ఈ ఆరాధన 2 గంటల పాటు జరిగింది. అనంతరం ఆలయ నిర్మాణ పనులకు సంబంధించి పునాది రాయి వేసి రామ జన్మభూమి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

 

రుద్రాభిషేకం తో.. భూమి పూజ ను ప్రారంభించినట్లు శ్రీరామజన్మభూమి ట్రస్ట్ తెలిపింది. అయితే.. ప్రస్తుతం కరోనా మహమ్మారి బెడద ఉండడం తో ఈ కార్యక్రమానికి అతి కొద్దీ మంది ప్రముఖులు హాజరయ్యారు. అయోధ్య రగడ ఎట్టకేలకు ముగిసిన సంగతి తెలిసిందే. సుప్రీమ్ కోర్ట్ ఎప్పటినుంచో నలుగుతూన్న ఈ సమస్యకు పరిష్కారం చూపింది. హిందువుల అయోధ్యను తిరిగి హిందువలకప్పగించింది. అయితే.. అక్కడ దేవాలయ స్థాపనకు కూడా మొదటి మెట్టు పడింది. అయోధ్య లో రామయ్య కు మందిరం కట్టాల్సిందేనని సుప్రీం కోర్ట్ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. లంకపై యుద్ధానికి వెళ్లే ముందు రాముడు రుద్రాభిషేకంతో శివుణ్ని ప్రార్థించాడ‌ని, రాముడు తొలిపూజ నిర్వహించిన సంప్రదాయాన్నే తామూ పాటించామని ట్ర‌స్టీ ప్ర‌తినిధులు తెలిపారు.

 

 మే 11న ఆలయ నిర్మాణం కోసం భూమిని చదును చేశామని.. ఈరోజు పునాది రాయి వేసిన‌ట్లు తెలిపారు. ఆల‌య నిర్మాణంపై ప్ర‌ధాన‌మంత్రి మోదీని క‌ల‌సి త్వ‌ర‌లోనే వివ‌రించనున్న‌ట్లు తెలిపారు. వాస్త‌వానికి ఈ ప్ర‌త్యేక భూమి పూజల్లో ప్ర‌ధాని మోదీ పాల్గొనాల్సి ఉండేంద‌ని అయితే క‌రోనా వైర‌స్ ఉధృతి నేప‌థ్యంలోనే అది సాధ్యం కాలేద‌ని పేర్కొన్నారు.  అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పు అనంతరం రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమమైన సంగతి తెలిసిందే. కరోనా లాక్ డౌన్ కారణం గా అయోధ్య రాముని దర్శనం నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే.. సడలింపులు నేపధ్యం లో ప్రస్తుతం భక్తుల దర్శనానికి అనుమతులిచ్చారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: