విజయవాడ నగరం మరోసారి లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తోంది. దాదాపు రెండు నెలలకు పైనే కనీసం అడుగు తీసి బయటకు వేయలేని పరిస్థితి నుంచి.. కొద్ది రోజుల క్రితమే సాధారణ స్థితికి వచ్చింది. కానీ కరోనా తీవ్రత దృష్ట్యా.. మరికొన్ని రోజులు లాక్ డౌన్ కొనసాగిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఇప్పటికే ఆర్థికంగా కష్టాల్లో ఉన్న జనం.. మళ్లీ లాక్క డౌన్ అంటే పరిస్థితి ఏంటనే ఆందోళనతో ఉన్నారు. 

 

లాక్ డౌన్ సడలింపులతో ఏపీలో ఉన్న అన్ని వ్యాపార సంస్ధలు తెరుచుకున్నాయి. విజయవాడ నగరంలో కూడా రద్దీ పెరిగిపోయింది. దీంతో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. మరోసారి లాక్ డౌన్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కోవిడ్ ఆర్డర్ 50 ప్రకారం కంటైన్మంట్ జోన్లను పునవ్యవస్థీకరిస్తున్నట్లు కలెక్టర్ ఇంతియాజ్ ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం విజయవాడ మున్సిపల్ లో 64 వార్డులు ఉండగా 22 వార్డ్ లు మినహ మిగిలిన 42 వార్డులను కంటైన్మంట్ జోన్లుగా ప్రకటించారు అధికారులు. కంటైన్మంట్ జోన్లలో యధావిదిగా లాక్ డౌన్ నిబంధనలు కొనసాగుతాయి. ఇక్కడున్న ప్రజలు ఎవరూ బయటకు రావడానికి వీల్లేదు. వన్ టౌన్ కూడా పూర్తిస్థాయిలో మూతపడింది. 

 

కరోనా బారినపడుతున్న వారిలో ఎక్కువ మంది వ్యాపారులే ఉంటున్నారు. అటు కృష్ణలంక నుంచి వన్ టవున్ వరకు ఉన్న అన్ని కేసుల్లో ఎక్కువ మంది వ్యాపారులే వున్నారు. విజయవాడ వ్యాప్తంగా 60 శాతం లాక్ డౌన్ ను ప్రకటించారు అధికారులు.ఇంకో ప్రక్క నగర శివార్లో జక్కంపూడి వైయస్సార్  కాలనీలో పదుల సంఖ్యలో కేసులు నయోదవుతున్నాయి. అక్కడ స్ధానికంగా వుండే శ్రీనివాస్ జనరల్ స్టోర్స్ యజమాని అనారోగ్యంతో హస్పటల్ లో చేరారు. ఆయనకు కరోనా టెస్టులు చేస్తున్నారు వైద్యులు. ఒక వేళ అతనికి పాజిటివ్ వస్తే మరిన్ని కేసులు పెరిగే అవకాశం ఉంది.

 

కంటైన్మెంట్ జోన్స్ అన్నీ వ్యాపారకూడళ్లు కావడంతో.. వ్యాపారులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే కష్టాలు పడుతున్న వారికి.. లాక్ డౌన్ తో మరిన్ని తిప్పలు తప్పడం లేదు. ఈ లాక్ డౌన్ ఎప్పటి వరకు ఉంటుందనేది వచ్చే కేసుల పైనే ఆధారపడి ఉంది. ప్రజలు ఇప్పటికైనా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: