తెలుగుదేశం పార్టీని వలసల కష్టాలు ఇబ్బంది పెడుతున్నాయి. ఇటీవల కాలంలో కాస్త తగ్గాయని అనుకున్నా.. ఇప్పుడు ఏకంగా మాజీ మంత్రి స్థాయి వ్యక్తులే పార్టీ నుంచి వెళ్లిపోతున్నారు. చంద్రబాబు తన రాజకీయ జీవితంలోనే అత్యంత దారుణమైన ఓటమిని ఏడాది క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చవి చూశారు. మొత్తం 175 సీట్లలో కనీసం 23 మంది మాత్రమే నెగ్గారు. అందులోనూ ఓ ముగ్గురు, నలుగురు ఇప్పటికే చంద్రబాబుకు గుడ్ బై చెప్పేశారు.

 

 

ఇక ఇప్పుడు టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు కూడా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన శిద్ధా రాఘవరావు.. సీఎం సమక్షంలో వైయస్‌ఆర్‌ సీపీలో చేరారు. ఈ మేరకు సీఎం వైయస్‌ జగన్‌.. రాఘవరావుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే ఈ వలసలు ఇంతటితో ఆగేలా కనిపించడం లేదు.

 

 

ఇప్పటికే అధికారం పోయింది.. కొడుకు లోకేశ్ అంది వచ్చే పరిస్థితి లేదు.. ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్న చంద్రబాబుకు తాజాగా చీరాల ఎమ్మెల్యే, టీడీపీకి దూరమైన నేత కరణం బలరామ్ ఆయన గుండెల్లో మరో బాంబు పేల్చారు. త్వరలోనే కొందరు టిడిపి ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు త్వరలోనే వెళ్లిపోతారని జోస్యం చెప్పారు. పార్టీ మారేందుకు ఎవరికి వారు వ్యక్తిగతంగా వైసీపీ అగ్రనేతలోత సంప్రదింపులు జరుపుతున్నారంటూ బాంబు పేల్చశారు.

 

 

ఇదే సమయంలో టీడీపీలో తాను అనుభవించిన క్షోభను గుర్తు చేసుకున్నారు కరణం బలరామ్. చంద్రబాబు నాయుడు తనను ఎంతో మానసిక వేదనకు గురిచేశారని... నారా లోకేష్‌ది తన గురించి మాట్లాడే స్థాయి కాదని విమర్శించారు. తండ్రీకొడుకులు ఎంత తక్కువ మాట్లాడితే అంతమంచిందని బలరాం హెచ్చరించారు. చంద్రబాబుది అవసరం ఉన్నప్పుడు వాడుకుని వదిలేసే తత్వమని బలరామ్ మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: