చంద్రబాబు వారసుడిగా రాజకీయ రంగంలో అడుగు పెట్టిన నారా లోకేష్ ఏ మాత్రం పార్టీ క్యాడర్ ని ఆకర్షించ లేకపోయారు. బహిరంగ వేదికలపై తన ప్రసంగాలతో అనేకసార్లు నవ్వులపాలైన నారా లోకేష్ ని ప్రత్యర్థుల పార్టీల నాయకులు అసలు లోకేష్ రాజకీయాలకు పనికిరాడు అన్నట్టుగా చిత్రీకరించారు. పైగా 2019 ఎన్నికలలో మొట్టమొదటి సారి అది కూడా అమరావతి రాజధాని ప్రాంతంలో పోటీ చేసి లోకేష్ ఓడిపోవడం భారీ దెబ్బ అని చెప్పవచ్చు. దీంతో చాలా వరకు రాజకీయాలకు దూరంగా ఉంటూ సోషల్ మీడియాలో టచ్ లో ఉంటూ అడపాదడపా రాణించిన నారా లోకేష్ ఇటీవల కొద్దిగా యాక్టివ్ అయ్యారు. జగన్ ఏడాది పరిపాలన గురించి సింగల్ గా మీడియా సమావేశం పెట్టి గతంలో లా కాకుండా చాలా డిఫరెంట్ గా ఎవరు ఊహించని విధంగా ప్రభుత్వంపై సెటైర్లు వేశారు.

 

అసలు మాట్లాడుతున్నది నారా లోకేష్ యేనా అన్న రీతిలో మీడియా సమావేశాన్ని సింగిల్ హ్యాండ్ తో డీల్ చేశాడు. ఇటువంటి పరిస్థితుల్లో త్వరలో రాష్ట్ర అధ్యక్ష పదవిని నారా లోకేష్ చేతిలో చంద్రబాబు పెట్టబోతున్నట్లు… లోకేష్ కుర్చీ ఎక్కాల్సిన టైం వచ్చింది అన్నట్టు టీడీపీ లో వార్తల మీద వార్తలు వినబడుతున్నాయి. ఇదిలా ఉండగా ముందు నుండి నారా లోకేష్ ని వ్యతిరేకిస్తున్న వర్గం ఒకటి తెలుగుదేశం పార్టీలో ఉందని ఎప్పటినుండో ఏపీ రాజకీయాల్లో వార్తలు వినబడుతున్నాయి.

 

ఈ నేపథ్యంలో ఈ వార్త వారు తెలుసుకొని నిజంగా నారా లోకేష్ కి చంద్రబాబు అధ్యక్ష పదవి చేపడితే ఉన్నట్టుండి ఒక్కసారిగా పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోదామని అనుకుంటున్నట్లు… ఇంకా టీడీపీ పార్టీ మునిగిపోయే నావ అన్నట్లు లోలోపల చర్చించుకొంటున్నారు అట. ఇదే తరుణంలో టీడీపీ పార్టీ నుండి గెలిచి వైసీపీలోకి వెళ్లిన చాలామందిని ప్రజాప్రతినిధులు కూడా పార్టీ మారిన సమయంలో ఎక్కువగా నారా లోకేష్ పై విమర్శలు చేసి వైసీపీ కండువా కప్పుకోవడం జరిగింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో నారా లోకేష్ ని  చంద్రబాబు కుర్చీ ఎక్కిస్తారో లేదో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: