పాకిస్తాన్ లో అసలు ఏం జరిగింది ఏం జరుగుతోంది ప్రస్తుత ప్రత్యేక ఇదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోతుంది. వాస్తవంగా పాకిస్తాన్లో  సోషల్ మీడియాలో ఒక రెండు రోజుల నుండి ట్రోల్  నడిచింది. 2018లో భారత్ పాకిస్తాన్ ఉగ్ర శిబిరంపై దాడి చేసినప్పుడు ఎలాంటి శబ్దాలు అయితే  వినపడ్డాయో...  అలాంటి శబ్దాలు ప్రస్తుతం  వినబడుతున్నాయి అని ఒక ట్రోల్  సోషల్ మీడియాలో నడిచింది. అదే ఇండియన్  యుద్ధ విమానాలు  పాకిస్తాన్ లోకి వచ్చినట్టున్నాయి అంటు  ఒక వార్త హల్చల్ చేస్తోంది. వెంటనే అక్కడి  ప్రాంతాల్లో కరెంట్ ఆపేయటం కూడా జరిగిపోయింది . మరో వైపు ఇండియా సైన్యం తాము ఎలాంటి విమానాలను పంపించలేదు అని  చెప్పింది. 

 

 

 రాత్రి వేళల్లో సంచరిస్తున్న యుద్ధ విమానాలకు శబ్దాలు తీవ్ర స్థాయిలో వచ్చాయి అని అంటున్నారు. దీనికి  సంబంధించిన వీడియోలు కూడా  సోషల్ మీడియాలో హల్ చల్ చేసాయి . ఈ నేపథ్యంలోనే ఎఫ్ 16 విమానంకు సంబంధించి శబ్దం కూడా  వినిపించింది అంటూ అక్కడి వాళ్లు సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం  చేశారు. ఆ తర్వాత అది మాయం అయిపొయింది అని ప్రచారం జరిగిపోయింది. ఈరోజు అరేబియా సముద్రం లో మిస్ అయిన ఎఫ్ 16 యుద్ధ విమానం గురుంచి  వెతుకుతున్నామంటూ తెలిపింది . ఈ విషయం ఎక్కడ వరకు వచ్చింది అంటే ఏకంగా  భారత దౌత్యాధికారులను పిలిచి  పాకిస్తాన్ వార్నింగ్ ఇచ్చే స్టేజ్  కి వచ్చింది . 

 


 ఇదంతా ప్రస్తుతం సోషల్ మీడియాలోనే  నడుస్తోంది. అయితే భారత యుద్ధ విమానాలు అంటే పాకిస్తాన్ లో ఎంత భయం పట్టుకుంది స్పష్టంగా అర్ధం అవుతుంది. . అయితే భారత యుద్ధ విమానాలు తిరుగుతున్నాయని పాకిస్తాన్ ఎఫ్ 16  పంపించడంతో అది  మిస్ అయింది. దీనికి సంబంధించి  విజువల్స్ కూడా పెట్టి డిలీట్ చేశారు. అయితే రెండు రోజుల్లో ఏం జరిగింది అనేది తెలియనుంది. మరియు మన దేశం పరిధిలో డ్రైవ్ చేస్తూ ఉంటే పొరపాటున పాకిస్థాన్ పరిధిలోకి వెళ్లాయా లేక ... ఇక్కడ డ్రైవ్  చేస్తుంటే పాకిస్తాన్ వాళ్ళు అక్కడ భయపడ్డారు అన్నది కొద్దీ  రోజుల్లో తేలనుందని  విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: