దశాబ్ద కాలం నుంచి వివాదాస్పద భాగంగా ఉన్న అయోధ్య భూభాగం కి సంబంధించిన వివాదానికి సుప్రీం కోర్టు తెరదింపిన  విషయం తెలిసిందే. వివాదాస్పద అయోధ్య భూభాగం విషయంలో సంచలన తీర్పును వెలువరిస్తూ సుప్రీంకోర్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. వివాదాస్పద అయోధ్య భూభాగం హిందువులకు చెందినదని.. ముస్లింలు ఆ విభాగం తమకే చెందుతాయని ఆధారాలు చూపించక పోవడంతో  వివాదాస్పద అయోధ్య  భూభాగం హిందువులకు చెందినవి అంటూ సుప్రీం కోర్టు సంచలన  తీర్పు వెలువరించింది. అదే సమయంలో అయోధ్య భూభాగంలో బాబ్రీ మసీదు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని తీర్పును వెలువరించింది. ఈ నేపథ్యంలో అయోధ్య భూ  భాగంలో ఎప్పుడెప్పుడు రామమందిర నిర్మాణం జరుగుతుందని హిందువులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. 

 


 అయితే తాజాగా అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సంబంధించి ప్రాథమిక కార్యక్రమాలు ఈరోజు జరిగింది. ఒకప్పుడు రావణాసురుడి తో పోరాడటానికి వెళ్ళినప్పుడు శివుడికి అభిషేకం చేసి రాముడు బయలుదేరుతాడు.ఈ  శుభ సూచకమైన అంశాన్ని  తాజాగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం శివుడికి అభిషేకం చేసి రామమందిర నిర్మాణానికి ప్రారంభించింది. అక్కడ స్థలాన్ని మొత్తం ప్రస్తుతం చదువు గా మార్చడం. అదే సమయంలో అప్పటి కాలానికి  సంబంధించిన కొన్ని విగ్రహాలు కూడా దొరికాయి. 

 


ఇక ఇప్పుడు ఆలయ నిర్మాణ ప్రక్రియ ప్రారంభమైంది. ఆలయ నిర్మాణ చిట్టచివరి అడ్డం కూడా తొలగిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం చెబుతున్నది  ఏమిటి అంటే ఎనిమిదేళ్ల కాలంలో అయోధ్యలో రామమందిర నిర్మాణానికి దాదాపు ఒక రూపం చేస్తోంది అని చెబుతున్నారు. 12 నుంచి 14 నెలల్లో ఈ ఆలయ నిర్మాణం పూర్తవుతుంది అని చెబుతున్నారు  అధికారులు. దీనికి ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని తామే నిర్మాణం చేసుకుంటామని  నిర్మాణం చేసుకుంటామని ట్రస్ట్ చెప్పింది . భక్తులు కూడా ఈ ఆలయ నిర్మాణానికి పెద్ద ఎత్తున విరాళాలు ఇస్తున్నారు. ఇంకా ఈ ఆలయ నిర్మాణం ఎలా ఉండబోతుంది అనేది ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: