అధికారం కోసం ఊగిసలాడే నేతల పరిస్థితి ఎప్పుడు రెంటికీ చెడ్డ రేవడిలాగానే తయారవుతుంది. ఒక్క పార్టీలో స్తిరంగా ఉండకుండా అధికార వ్యామోహంతో అటు ఇటు గంతులేస్తే...ఎటు కాకుండా పోతారు. సరిగా ఇలాంటి పరిస్థితిలోనే టీడీపీ సీనియర్ నేత బొడ్డు భాస్కర రామారావు ఉన్నారు. టీడీపీలో రాజకీయ జీవితం మొదలు పెట్టిన బొడ్డు...1994, 1999 ఎన్నికల్లో పెద్దాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.

 

ఇక 2004, 2009 ఎన్నికల్లో అదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఓడిపోయినా సరే చంద్రబాబు...బొడ్డుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. కానీ ఆయన అవకాశం కోసం చూసి వైసీపీలోకి వెళ్ళిపోయారు. దీంతో 2014 ఎన్నికల్లో ఆయన కుమారుడు బొడ్డు వెంకటరమణ చౌదరీకి జగన్ రాజమండ్రి ఎంపీ సీటు ఇచ్చారు. కానీ ఆ ఎన్నికల్లో బొడ్డు కుమారుడు ఓటమి పాలయ్యారు.

 

అయితే ఓడిపోయిన ఆరు నెలలకే కొడుకుతో కలిసి లగేజ్ సర్దుకుని మళ్ళీ టీడీపీలోకి వచ్చారు. ఇక అధికారం ఉన్నన్ని రోజులు బొడ్డు బాగానే రాజకీయం చేశారు. ఎప్పుడైతే పెద్దాపురం సీటు రాదని తెలిసిందో...అప్పుడే టీడీపీలో ఉంటూనే చినరాజప్పకు సహకరించకుండా అపోజిట్‌లో వైసీపీ అభ్యర్ధిగా నిలబడిన తోట వాణికి సపోర్ట్ చేశారు. కానీ బొడ్డు ప్లాన్ అక్కడే ఫ్లాప్ అయింది. చినరాజప్ప మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచేశారు.

 

ఇలా ప్లాన్ ఫెయిల్ కావడంతో బొడ్డు...మళ్ళీ వైసీపీలోకి వెళ్ళేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ జగన్ మాత్రం ఆ ఛాన్స్ ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. ఇదే సమయంలో టీడీపీలో ఉన్నా సరే... చంద్రబాబు కూడా బొడ్డుని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రస్తుతానికి బొడ్డు టీడీపీలో ఉన్నారు కానీ....ఆయన్ని పట్టించుకొనే నాథుడే లేడు. ఎన్నికల్లో రాజప్పకు ద్రోహం చేయాలని చూడటంతో పక్కనపెట్టేశారు.  దీంతో బొడ్డు పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. ఒకవేళ జగన్ ఏమన్నా కరుణిస్తే బొడ్డుకు రాజకీయంగా మరో అవకాశం దొరుకుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: