గత కొన్ని రోజుల నుండి కేరళలో భారీగా కరోనా కేసులు నమోదుకాగా ఈరోజు మాత్రం స్వల్పంగా తగ్గాయి.  రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం 65పాజిటివ్ కేసులు నమోదవ్వగా అందులో 59 విదేశాల నుండి వచ్చినవి కాగా మిగితావి  కాంటాక్ట్ కేసులు.. అలాగే ఈరోజు కరోనా తో ఒకరు మృతి చెందగా 57మంది బాధితులు కోలుకున్నట్లు కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది.  
 
ఈకొత్త కేసులతో కలిపి కేరళ లో ఇప్పటివరకు మొత్తం 2161కేసులు నమోదుకాగా అందులో 1238కేసులు యాక్టీవ్ గా వున్నాయి. ఇప్పటివరకు 905 బాధితులు కరోనా నుండి కోలుకోగా 17మంది మరణించారు. 
ఇక కేరళలో కరోనా కేసులు తగ్గగా మిగితా రాష్ట్రాల్లో మాత్రం భారీగా పెరిగాయి. అందులో భాగంగా ఈరోజు అత్యధికంగా మహారాష్ట్ర లో 3254 కేసులు నమోదు కాగా తమిళనాడు లో1927,ఢిల్లీ లో 1501, గుజరాత్ లో 510 కేసులు నమోదయ్యాయి. అన్ని రాష్ట్రాల్లో కలిపి ఈఒక్క రోజే కరోనా కేసుల సంఖ్య 10000 దాటింది. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 280000 దాటగా 7900 కరోనా మరణాలు చోటుచేసుకున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: