తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. గతవారం రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా 1100 కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం. ఇక ఈరోజు కొత్తగా రాష్ట్రంలో 191 పాజిటివ్ కేసులు నమోదుకావడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4111కి చేరింది. అందులో ఇప్పటివరకు 1817మంది బాధితులు కోలుకోగా ప్రస్తుతం 2138కేసులు యాక్టీవ్ గా వున్నాయి.
 
ఈరోజు కరోనా వల్ల  8మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 156కు చేరింది. సౌత్ లో అత్యధిక కరోనా మరణాలు నమోదయిన రాష్ట్రాల్లో తెలంగాణ ప్రస్తుతం రెండో స్థానం లో వుంది. మొదటి స్థానంలో వున్న తమిళనాడులో ఇప్పటివరకు 326 కరోనా మరణాలు సంభవించాయి. 
 
ఇదిలావుంటే సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించడం కొంతలో కొంత ఊరట నిచ్చే విషయం. ఓ వైపు కరోనా కేసులు పెరిగిపోతుంటే  జూనియర్ డాక్టర్లు నిన్న రాత్రి విధులను బహిష్కరించి సమ్మె కు దిగడంతో ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి అయితే వారితో ఈరోజు చర్చలు జరిపిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వారి డిమాండ్ల పై సానుకూలంగా స్పందించడంతో డాక్టర్లు సమ్మె విరిమించి తిరిగి విధుల్లో చేరారు. గాంధీ ఆసుపత్రిలో ఓ జూనియర్ డాక్టర్ పై నిన్నరాత్రి దాడి జరగడంతో దానికి నిరసనగానే జూడాలు ఆందోళనకు దిగారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: