చంద్రబాబు ఏపీలో విపక్ష నేత. నిన్నటి దాకా ముఖ్యామంత్రిగా అధికారంలో ఉన్న నాయకుడు. సీనియర్ మోస్ట్ లీడర్. ఇక జగన్ యువనేత. ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏడాది పాలన పూర్తి చేసుకుని రెండవ ఏడాదిలో అడుగుపెట్టారు. ఈ ఇద్దరు నేతలు వంతుల వారీగా అధికారం పంచుకుంటే ఏపీలో మూడవ పార్టీకి కష్టమే.

 

అసలే ఏపీని టార్గెట్ చేసిన బీజేపీకి ఈ ఇద్దరూ ఇపుడు శత్రువులుగా  కనిపిస్తున్నారు. అందుకే ఇద్దరినీ టార్గెట్ చేస్తున్నారు. చంద్రబాబు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్ బెయిల్ మీద ఉన్న ముఖ్యమంత్రి అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఇద్దరూ కలసి ఏపీని బ్రష్టు పట్టించారని కూడా అన్నారు.

 

చంద్రబాబు బీజేపీని వదిలేసి ఎన్నికల ముందు ఏడాది ప్రధాని పదవి మీద మోజుతో కాంగ్రెస్ కూటమితో జట్టు కట్టారని రాం మాధవ్ అనడం విశేషం. ఇక ఆయన అలా రాజకీయ అవసరాల‌ కోసం బీజేపీకి హ్యాండ్ ఇస్తే జగన్ ది ఏపీలో ఏడాది పాలన అంతా రివర్స్ అంటున్నారు. పోలవరం, రాజధాని మొదలు అన్నీ కూడా రివర్స్ పాలన చేస్తూ ఏపీని పూర్తిగా తిరోగమనంలోకి తీసుకెళ్తున్నారని రాం మాధవ్ గట్టిగానే కామెంట్స్ చేశారు.

 

ఇపుడు ఏపీలో రాజకీయ శూన్యత ఉందని, దాన్ని బీజేపీ  మాత్రమే సొమ్ము చేసుకోగలదని అంటున్నారు. బీజేపీ ఆలోచనలు బట్టి చూస్తే జనసేనతో కలసి వచ్చే ఎన్నికల్లో ఢీ కొట్టాలని అనుకుంటోంది. బాబుని జగన్ని కలిపి ఒకే గాటకు కట్టేయడం ద్వారా ఏపీ ప్రజలకు తామే అసలైన ఆల్టర్నేషన్  అంటోంది. మరి బీజేపీ దూకుడు రేపటి రోజున ఇలాగే ఉంటే బాబు, జగన్ లకు కష్టకాలమేనని చెప్పకతప్పదేమో. చూడాలి  మరి కమలనాధుల కదన కుతూహలరాగం ఎలా ఉంటుందో కాలమే చెప్పాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: