ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కొద్దీ కరోనా వైరస్ కేసులు బయటపడటంతో ప్రభుత్వ యంత్రాంగం మరియు వైద్యులు అలర్ట్ అవుతున్నారు. ముఖ్యంగా కృష్ణా జిల్లా విజయవాడలో ఎక్కువగా కరోనా వైరస్ కేసులు బయట పడుతున్న తరుణంలో మరొకసారి కృష్ణా జిల్లా మొత్తం లాక్ డౌన్ లోకి వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. రోజు రోజుకి కేసుల తీవ్రత పెరుగుతూ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అలర్ట్ అయింది.  ఈ నేపథ్యంలో పాలనాపరంగా చాలా మంది ప్రభుత్వ అధికారులు ఇదే ప్రాంతంలో ఉండటంతో జగన్ పనిగట్టుకుని విజయవాడ మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టినట్లు, దీంతో క్రిష్ణాజిల్లా కలెక్టర్ ఇంతియాజ్ కి పూర్తి అధికారాలు ఇచ్చి కరోనా వైరస్ కట్టడి చేయడం కోసం కీలక నిర్ణయాలు తీసుకోవాలని సూచించినట్టు సమాచారం.

 

పరిస్థితి ఇలా ఉండగా, వ్యవహారం మొత్తం అదుపు తప్పెలా కనిపిస్తూ ఉండడం తో జనాల్లో కి వేరేలాగా వెళుతుంది అనే ఆలోచనతో క్రిష్ణాజిల్లా కలెక్టర్ ఇంతియాజ్ జూన్ 11 వ తారీకు నుండి విజయవాడలో దాదాపు 45 కంటోన్మెంట్ జోన్లో లాక్ డౌన్ నిబంధనలు పూర్తిగా పాటించాలని ప్రజలు ఇంటి నుండి బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుత విజయవాడ మున్సికల్ లో 64 వార్డులు ఉండగా 22  వార్డ్ లను మినహాయించి మిగిలిన 42 వార్డులని కంటైన్మెంట్ జోన్ లగా గుర్తించారు.

 

ఈ కంటైన్మెంట్ జోన్ లలో లాక్ డౌన్ నిబంధనలు యధావిధిగా కొనసాగించబడతాయి అని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. అంతేకాకుండా ఈ కంటైన్మెంట్ జోన్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఆరోగ్య  సేతు యాప్ ని  డౌన్లోడ్ చేసుకోవాలి అని తెలిపారు. జలుబు, దగ్గు మొదలగు కరోనా వైరస్ లక్షణాలు  ఉన్న ఆయా వార్డ్ వాలెంటైర్లకు గాని ఎ ఎన్ ఎమ్, సంబంధిత వార్డ్ డాక్టర్ కి  గాని సంప్రదించాలి అని సూచించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: