కరోనా వైరస్ ఇండియాలో విషం ఎక్కిన కోరలు లాగా దేశం పై రెచ్చిపోతుంది. లాక్ డౌన్ ఆంక్షలు సడలింపు ఇవ్వటంతో ప్రజలు బయటకు రావడంతో వైరస్ పాజిటివ్ కేసులు ఉన్న కొద్ది బయట పడుతున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో అయితే కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. మొదటి నుండి ఢిల్లీలో కరోనా వైరస్ ప్రభావం చూపుతూనే ఉంది. ఎక్కడా కూడా కరోనా వైరస్ కంట్రోల్ అయిన దాఖలాలు  ఢిల్లీలో చోటు చేసుకోలేదు.  ఎన్ని రకాల నిర్ణయాలు తీసుకున్న  కఠినమైన చర్యలు చేపట్టినా గాని  కరోనా వైరస్ తీవ్రత  పెరుగుతూనే ఉండటం తప్ప అదుపులోకి వచ్చిన పరిస్థితి కనబడలేదు.  ఇటీవల ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ వచ్చే నెల చివరి నాటికి రాష్ట్రంలో 5.5 లక్షల కేసులు నమోదు అయ్యే అవకాశం ఉందని 80 వేల పడకలు తమకు అవసరం అవుతాయని ఆయన అన్నారు. 

IHG

కేసుల తీవ్రత తగ్గించడానికి ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్న వైరస్ ప్రభావం ఉన్న కొద్దీ బలపడుతోందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న పరిస్థితి చూస్తే మరో న్యూయార్క్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలువురు విశ్లేషిస్తున్నారు. అంతేకాకుండా మరణాల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో మరొకసారి ఢిల్లీ సరిహద్దులను క్లోజ్ చేయాలని సీఎం కేజ్రీవాల్ ఆలోచిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఇప్పటికే హర్యానా ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులను మూసి వేయడానికి గానూ ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రివాల్ నిర్ణయం తీసుకున్నారు.

IHG

హర్యానా గుర్గావ్ నుంచి 45 వేల మంది ప్రతీ రోజు ఢిల్లీ వస్తున్నారు అని అక్కడి అధికారులు చెప్తున్నారు. ఇక ఉత్తరప్రదేశ్ నుంచి కూడా భారీగా వస్తున్నారు. అందుకే అక్కడ సరిహద్దులను ఇప్పుడు మూసి వేయడ౦ మంచిది అని భావిస్తుంది సర్కార్. మొత్తంమీద మొదటిలో సీఎం కేజ్రీవాల్ తీసుకున్న చర్యలకు రాష్ట్రంలో కరోనా కట్టడి కాకపోవటంతో, ప్రస్తుత పరిస్థితి బట్టి చూస్తే ఆయన చేతుల్లోంచి రాష్ట్రం జారిపోయినట్లే అని మరోసారి సరిహద్దులు మూయడమే బెటర్ అని మరికొందరు అంటున్నారు. మరి ఈసారైనా ఢిల్లీలో పరిస్థితి అదుపులోకి వస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: