తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన చిత్తూరు జిల్లా పెనుమూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు అనితారాణి కేసులో సీఐడీ అధికారులకు చేదు అనుభవం ఎదురైంది. విచారణలో భాగంగా రెండో రోజు అధికారులు ఆమె నివాసానికి వెళ్లగా వారిని గమనించిన అనితారాణి ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకుంది. కాగా, డాక్టర్‌ అనితారాణి మానసిక స్థితి సరిగా లేదని డీఎంఅండ్ హెచ్‌వో పెంచలయ్య అన్నారు. ఇప్పటివరకు పనిచేసిన ప్రాంతాల్లో తన తీరుతో అనితారాణి వివాదాస్పదమయ్యారని చెప్పారు. ఇదిలా ఉంటే.. చిత్తూరు జిల్లా పెనుమూరు ప్రభుత్వ డాక్టర్‌ అనితారాణి వ్యవహారంలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఐడీ దర్యాప్తునకు ముఖ్యమంత్రి ఆదేశించారు. నిజానిజాలేంటో తేల్చాలని సీఐడీ అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు.

 

ఈ నేపథ్యంలో అనితా రాణి ఇంటికి సీఐడీ అధికారులు వెళ్లారు. కానీ, సీఐడీ అధికారులకు వాంగ్మూలం ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలుంటాయని సీఐడీ ఆఫీసర్స్ చెప్తున్నారు.  తాజాగా ఇదే టాపిక్ పై డిప్యూటీ సీఎం నారాయణస్వామి స్పందించారు. అనితారాణితో తాను మాట్లాడినట్టు నిరూపించినా, ఆమెను వేధించినట్టు నిరూపించినా రాజీనామా చేస్తానని తెలిపారు. ఏపిలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజా రంజకంగా పాలన కొనసాగిస్తున్నారు.. దాంతో ప్రతిపక్షానికి కంటగింపుగా తయారైంది. చంద్రబాబు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు నారాయణ స్వామి.

 

ఈ ఏడాది మార్చి 22వ తేదీ పెనుమూరు ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి భరత్‌ అనే వ్యక్తి వైద్యం కోసం రాగా వైద్యం చేయకుండా అనితారాణి తలుపులు వేసుకున్నారు. ఇదేమిటని గ్రామస్తులు నిలదీయడంతో తనను కులం పేరిట ధూషించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఇదేంటని ప్రశ్నించినందుకు తమపైనే ఆరోపణలు చేసిందని భరత్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారంపై నిజానిజాలు తేల్చడానికి కేసును సీఐడీకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే రెండు రోజుల నుంచి సీఐడీ విచారణ జరుపుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: