నిన్న సుప్రీం కోర్టులో ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా తీర్పు వచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు రాజ్యాంగబద్ధమైన పదవులతో ప్రభుత్వాలు ఆడుకోవద్దని... జగన్ సర్కార్ ఆర్డినెన్స్ ను మంచి ఉద్దేశంతో తెచ్చినట్టు తమకు అనిపించడం లేదని కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ తరపు లాయర్ లేవనెత్తిన ప్రశ్నలకు రెండు వారాల్లో సమాధానాలు ఇవ్వాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్, ప్రతివాదులకు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. 
 
సుప్రీంకోర్టులో నిమ్మగడ్డ కేసులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు రావడంతో టీడీపీ నేతలు వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. జగన్ ను తన లీగల్ టీం తప్పుదోవ పట్టిస్తోందనే విమర్శలు కూడా విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతున్నాయి. హైకోర్టు, సుప్రీం కోర్టులలో ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా తీర్పులు వెలువడుతూ ఉండటంతో జగన్ ఆచితూచి అడుగులేయాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 
సలహాదారులు, ఇతర బృందం చేస్తున్న తప్పుల వల్లే ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా కోర్టుల్లో తీర్పులు వెలువడుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వాళ్లు చేస్తున్న తప్పుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని.... సామాన్యులు కూడా అంచనా వేయగలిగే విషయాలను సుప్రీంకు తీసుకెళ్లి జగన్ లీగల్ టీం ప్రభుత్వానికి మొట్టికాయలు వేయిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 
జయన్ న్యాయవ్యవస్థ టీం జగన్ కు మంచి చేయకపోగా జగన్ కు చెడు చేస్తోందని... ప్రభుత్వం పరువు హైకోర్టు, సుప్రీం కోర్టులో పోయేలా చేస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా హైకోర్టులో 65 ఎదురుదెబ్బలు తగిలాయి. గతంలో ఏ ప్రభుత్వం ఎదుర్కోని పరిస్థితిని జగన్ సర్కార్ ఎదుర్కుంటోంది. సీఎం జగన్ లీగల్ టీం ఆయనకు సరైన సలహాలు ఇవ్వడం లేదన్న అభిప్రాయాలు ప్రజల నుండి కూడా వ్యక్తమవుతున్నాయి.                     

మరింత సమాచారం తెలుసుకోండి: